చిత్రం : జయదేవ్
రేటింగ్ : 1.25/5.0
బ్యానర్ : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం : మణిశర్మ
దర్శకుడు : జయంత్ సి పరాన్జీ
నిర్మాత : కె. అశోక్ కుమార్
విడుదల : జూన్ 30, 2017
స్టారింగ్ : గంటా రవి, మాళవిక రాజ్, వినోద్ కుమార్, రవి ప్రకాష్ తదితరులు
ఏపీ మంత్రి గంట శ్రీనివాస్‌కు సినిమాలు అంటే అభిమానం. ఆ అభిమానంతో తనయుడిని సినిమాల్లోకి తీసుకు రావాలని భావించాడు. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్త ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండటం, ఆ ప్రభుత్వంలో తాను భాగస్వామి అవ్వడంతో వెంటనే తనయుడిని హీరోగా పరిచయం చేశాడు. మరి ఎంట్రీ సులువుగానే లభించినా కూడా రవికి ఈ సినిమా సక్సెస్ అయ్యిందా అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం.
కథలోకి వెళితే : సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జయదేవ్(రవి). తన ఏరియాలో ఒక పోలీస్ ఆఫీసర్ హత్యకు గురి అవుతాడు. ఆ హత్య ఎలా జరిగింది, హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే విషయాలను ఎంక్వౌరీ చేయడమే ఈ చిత్రం కథ. ఆ క్రమంలో మస్తాన్ భాయ్(వినోద్ కుమార్)తో జయదేవ్ ఎలా పోరాడాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల ఫర్ఫార్మెన్స్ : గంటా రవి నటనలో ఓనమాలు తెలియని వ్యక్తిగా నటించాడు. కనీసం ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలవరి కూడా సరిగా లేదు. ఇక రొమాంటిక్ సీన్స్‌లలో చెత్త నటన కనబర్చాడు. సినిమాకు రవి పెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. ఇక హీరోయిన్ మాళవిక కూడా పెద్దగా చెప్పుకునే విధంగా ఏమీ నటించలేదు. ఆమె పాత్ర నిడివి కూడా కాస్త తక్కువగానే ఉంది. అందంతో అక్కడక్కడ ఆకట్టుకునే ప్రయత్నం చేసి పర్వాలేదు అనిపించింది. మిగిలిన వారి గురించి చెప్పుకోదగ్గట్లుగా ఏ ఒక్కరి పాత్రలు లేవు.
సాంకేతికపరంగా: మణిశర్మ పాటలు పాతచింత కాయ పచ్చడి తరహాలో ఉన్నాయి. 1990లలో పాటలు ఉన్నట్లుగా చిత్రంలోని పాటలు ఉన్నాయి. ఒక్క పాట కూడా వినసొంపుగా లేవు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మణిశర్మ ఎప్పటిలాగే మెప్పించాడు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించి కొన్ని సీన్స్‌ను హైలైట్ చేశాడు. ఎడిటింగ్‌లో లోపాలున్నాయి. పలు సీన్స్ డ్రాగ్ చేసినట్లుగా ఉండి ఆకట్టుకోలేక పోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ సినిమాటోగ్రఫీ కారణంగా హైలైట్ అయ్యాయి. దర్శకుడు జయంత్ సి పరాన్జీ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేక పోవడంతో పాటు దర్శకత్వం కూడా కొత్తగా లేదు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ: డబ్బులు ఉండగానే హీరో అవ్వచ్చు అనే టాక్ ఉంది. అది మరోసారి రుజువు అయ్యింది. బాగా డబ్బులు ఉన్న గల్లా వారు సునాయాసంగా హీరోగా అయ్యాడు. అయితే డబ్బులు ఉండటంతో పాటు ప్రతిభ ఉంటేనే సినిమాల్లో రాణించలరు. ఏదోలా ఎంట్రీ అయితే లభిస్తుంది కాని స్టార్ ఇమేజ్ రావడం అంటే కష్టమే. రవి పరిస్థితి కూడా అంతే ఉంది. సినిమా అయితే చేశాడు. కాని ఆసినిమాలో మ్యాటర్ లేదు. ఆయనలో కూడా మ్యాటర్ లేక పోవడంతో సినిమా చెత్తగా తేలిపోయింది. ఇదో వృదా ప్రయత్నం అంటున్నారు.
ప్లస్ పాయింట్స్ :
చెప్పుకోవడానికి ఏమీ లేవు.
నచ్చనివి :
చాలా చాలా ఉన్నాయి.
చివరగా :
బాబోయ్ ఈ జయదేవ్‌ను భరించలేం.
