టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు కూడా కోహ్లీ ఇంతలా బాధపడలేదేమో.. కానీ నిన్న రాత్రి మాత్రం కోహ్లీ నిద్ర పోలేదట. కాళరాత్రిగా గడిచిందట.. ఆదివారం కోల్ కతతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అత్యంత దారుణమైన ఆటతీరుతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పరువు తీసింది. తక్కువ స్కోరు 49కే బెంగళూరు అలౌట్ అయ్యింది.. ఐపీల్ చరిత్రలోనే ఇదే అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం. ఈ ఘోర ఓటమికి కోహ్లీ కుమిలిపోయాడట.. కానీ కోహ్లీ ఆవేదనలో కూడా అర్థముంది..
ప్రపంచంలోనే భీకర బ్యాట్స్ మెన్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఉన్నారు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ మేటి టీ20 బ్యాట్స్ మెన్ ఆ జట్టు సొంతం. వీళ్లను చూస్తే ప్రత్యర్థులు సగం చస్తారు. అంతటి హేమాహేమీలున్న జట్టు కేవలం 49 పరుగులకే అలౌట్ కావడాన్ని కోహ్లీ తో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత దారుణమైన డకౌట్ చూడడం ఎంతో బాధ కలిగించిందని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడు.
అసలు ఈ మ్యాచ్ చూశాక ఇక్కడ నిల్చొని ఇలా మాట్లాడడానికి బాధేస్తోందని విరాట్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఫ్రొఫెషనల్ క్రికెట్ లో తాను ప్రాతినిధ్యం వహించిన టీంలో తన కెరీర్ లో ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని.. తమ జట్టు పూర్తి విఫలమైందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఆటతీరు ఏమాత్రం సంతృప్తికరంగా సాగలేదని కుండబద్దలు కొట్టాడు. ఇంత అయోమయ బ్యాటింగ్ తన జన్మలో చూడలేదని వాపోయారు.
