రంగంలోకి జనసేనాని


జనసేనాని మరో లేఖాస్త్రం విడిచారు. 2019 ఎన్నికలకు సీరియస్ గా ముందుకెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే జనసేన గుర్తింపు శిభిరాలను ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే జనసేన ప్రకటించిన రిక్రూట్ మెంట్ కు ఉత్తరాంధ్ర నుంచి 6వేల మంది, గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4500 మంది ఆన్ లైన్ పార్టీ కోసం పనిచేయడానికి దరఖాస్తులు చేసుకున్నారని.. వారందరికీ ఈ శిబిరాల్లో చేర్చుకొని ఎంపిక చేస్తామని తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని పవన్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, 19,20న విశాఖ జిల్లాలో, 23,24,25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. స్పీకర్, అనలిస్ట్స్, కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పేరుపేరున శుభాభినందనలు అని పవన్ పేర్కొన్నారు.

యువకులు, మేధావులను భాగస్వాములను చేయాలన్న తలంపుతోనే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని.. ఇంత పెద్ద ఎత్తున ఆదరించిన దరఖాస్తుదారులందరికీ ఈమెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు కబురు పంపారని.. వారంత శిబిరానికి రావాలని కోరారు.

 

To Top

Send this to a friend