పవన్ కు పార్ట్ టైం పాలిటిక్స్ దెబ్బ

జనసేనాని పవన్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగి నాయకులు, కార్యకర్తలు, వ్యహకర్తల కోసం అనంతపురం జిల్లాలో నోటిఫికేషన్ వేస్తే వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా.. కేవలం 2వేలు మాత్రమే.. అంత పెద్ద జిల్లా నుంచి అంత తక్కువ స్థాయిలో దరఖాస్తుల రావడం ఇప్పుడు జనసేన పార్టీని కలవరపరుస్తోంది.. ఇదే కాదు.. తాజాగా శనివారం గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదే రిక్రూట్ మెంట్ వేయగా.. దానికి పెద్దగా స్పందన రాకపోవడంతో పవన్ అండ్ కోలో నిర్వేదం అలుముకున్నట్లు సమాచారం.

జనసేన రిక్రూట్ మెంట్ కి స్పందన లేకపోవడానికి ప్రధాన కారణం పవన్ పార్ట్ టైం పాలిటిక్సేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని సమస్యలపై ట్విట్టర్ ద్వారా మాత్రమే స్పందించడం.. అమావాస్య, పౌర్ణమికి మాత్రమే క్షేత్రస్థాయికి రావడంతో పవన్ పై ప్రజల్లో నమ్మకం పోతోందని అభిప్రాయపడుతున్నారు.

పవన్ అన్నయ్య చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు వదిలేసి కష్టపడ్డాడు. రాయలసీమ లోని తిరుపతి నుంచి గెలిచాడు. ఆయన సీరియస్ పాలిటిక్స్ లోకి రావడంతో చాలామంది ప్రజారాజ్యంలో చేరారు. కోట్లు ఖర్చుపెట్టారు. కానీ గెలవలేకపోయారు. అంత సీరియస్ గా ట్రై చేస్తేనే అధికారం దక్కని చిరంజీవి ముందు ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న పవన్ కు ప్రజల మద్దతు ఎంత లభిస్తుందనేది విశ్లేషకులు ప్రశ్న..?

అందుకే గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర రిక్రూట్ మెంట్ వేసినా కూడా ఎవ్వరూ దరఖాస్తులకు ఆసక్తి చూపడం లేదు. పవన్ అంటే పడిచచ్చే అభిమాన ఘనం కూడా పవన్ పార్టీ తరఫున పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదన్నది దరఖాస్తులన్నీ బట్టి అర్థమవుతోంది. సో ఇప్పటికైనా జనసేనాని 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీరియస్ పాలిటిక్స్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

To Top

Send this to a friend