ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన,బీజేపీ ఎదగాలంటే ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజకీయ శూన్యత (political vacuum) ఉన్నప్పటికీ జనసేన,బీజేపీ కూటమి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదు.

పాలక వైసీపీ పై ప్రజల ఆశలు అతి స్వల్ప కాలంలోనే వమ్ము అవుతున్నాయి. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీడీపీ ఊరూరూ తిరుగుతుంటే జనసేన,బీజేపీ కూటమి మాత్రం ప్రత్యామ్నాయ శక్తి తామే అని బలంగా చెప్పలేక పోతున్నది.

🔯అక్కడక్కడా జనసేన క్యాడర్ ప్రజా సమస్యల పై పోరాటాలు చేస్తున్నారు కానీ బీజేపీ నేతలు పెద్దగా కలిసివస్తున్నట్లు కనిపించడం లేదు.

🔯టీడీపీ అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు బెటర్ అనే ప్రచారం చేస్తున్నది. అదే సమయంలో టీడీపీ వైఫల్యాలు మాత్రం నామ మాత్రం కూడా ప్రస్తావించడం లేదు.తద్వారా నేటికీ వైసీపీ కి టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీ గా ప్రజలకు బలంగా సందేశం పంపుతున్నారు.

🔯70 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ ఉంటే జనసేన,బీజేపీ నాయకులు మాత్రం ఆ విధంగా పర్యటించడానికి ఆర్ధిక వనరులు లేని వారులాగా బీదతనం ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తున్నది.

🔯బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో తమ కూటమి బలోపేతం చేస్తే వైసీపీ తో సంబంధాలు దెబ్బతింటాయేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. పార్లమెంట్ లో వైసీపీ బలం తమకు అండగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది తప్ప క్షేత్ర స్థాయిలో కూటమి అభివృధ్ధి పై దృష్టి పెట్టడం లేదు.

🔯మరొక వైపు టీడీపీ వైసీపీ చేసే ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలను తమ మీడియా ద్వారా ఎండగడుతున్నది.
టీడీపీ కి బూత్ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంది.ఇప్పటి కిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గ్రామ,మండల స్థాయిలో ప్రజలు టీడీపీ నే వైసీపీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ గా భావించే పరిస్థితి ఉంది.

🔯పట్టణాలు,నగరాల్లో కొంత వరకు బీజేపీ,జనసేన కొన్ని కార్పొరేటర్,కౌన్సిల్ సీట్లు గెలుచుకోవచ్చు.
ఇప్పటికిప్పుడు ఈ కూటమి కి 10% ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఓట్లు 20% చేరినప్పుడే తటస్థులను ఈ కూటమి ఆకర్షించుకోగలుగుతుంది.

🔯అమరావతి రాజధాని విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని తమ అనుకూల మీడియా ద్వారా బీజేపీ పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ని నియంత్రించగలరు కానీ ఆ పని చేయడం లేదు అని టీవీ డిబేట్ లలో, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం అంతా బీజేపీ పై నిందలు వేయడానికే.

🔯కేంద్రంలో బీజేపీ,వైసీపీ సంబంధాలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ,జనసేన కూటమి ఎదుగుదల కు పెద్ద అడ్డంకిగా ఉంది . వైసీపీ పై బీజేపీ విమర్శల దాడి పెంచాలి.వైసీపీ కి,టీడీపీ కి తాము వ్యతిరేకం అని బలంగా చెప్పాలి.

🔯ఈ పరిస్థితులు మారాలంటే బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన పార్టీతో కలిసి కార్యక్రమాలు చేపట్టాలి.

🔯ఇప్పటివరకు జనసేన,టీడీపీ రెండూ ఒక్కటే అన్న వైసీపీ ప్రచారం ప్రజల్లో ఉంది. ఆ దుష్ప్రచారం త్రిప్పి కొట్టడానికి జనసేన టీడీపీ పై విమర్శల దాడి పెంచాలి.

🔯గ్రామ,మండల, జిల్లా స్థాయిలో బీజేపీ,జనసేన కూటమి కలిసి నడిచేలా సమన్వయ కమిటీ లు ఏర్పాటు చేయాలి.

🔯మురళి దేవుడర్,పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ లు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రజావ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ భారీ సభలు నిర్వహించాలి. ఆ సభలకు నరేంద్రమోదీ, అమిత్ షా లాంటి పెద్ద నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించాలి.
తద్వారా తమ కూటమి కి అన్నిరకాలుగా బీజేపీ అధిష్టానం అండగా ఉందని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలి.

🔯టీడీపీ పాలనలో జరిగిన భారీ అవినీతి పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు.స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్ ) ఏర్పాటు చేసినప్పటికీ దానికి న్యాయస్థానం లో చట్ట బద్ధత లేదు.కాలహరణ తప్ప తేలేది ఏమీ ఉండక పోవచ్చు.

🔯ఆ విధంగా వైసీపీ,టీడీపీ దాగుడు మూతలు ఆడుతూ కాలం గడుపుతూ జనసేన, బీజేపీ కూటమి బలపడకుండా , 2024 లో జరిగే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగకుండా చూస్తున్నారు.
ఈ వైసీపీ నాటకాలను బీజేపీ గమనించాలి.ఇకనైనా కూటమి క్రీయాశీలంగా వ్యవహరించాలి.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend