దుమ్ము రేపుతున్న జై టీజర్‌


నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన జై లవకుశ చిత్రానికి చెందిన జై టీజర్‌ దుమ్ము రేపుతుంది.  టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. అతి తక్కువ సమయంలోనే అయిదు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డులు బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు ఏ టీజర్‌ కూడా ఇంత తక్కువ సమయంలో 5 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకోలేదు. యూట్యూబ్‌ మరియు ఫేస్‌బుక్‌లో ఈ టీజర్‌ భారీగా ట్రెండ్‌ అవుతుంది.

ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు పదే పదే ఈ టీజర్‌ను చూస్తూనే ఉన్నారు. లక్షల్లో లైక్స్‌ మరియు వేలల్లో షేర్స్‌ దక్కుతున్నాయి. ఇక సెలబ్రెటీలు కూడా ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి టీజర్‌పై స్పందిస్తూ చాలా బాగుందని, తారక్‌లో ఎనర్జీ అదిరింది అంటూ ట్వీట్‌ చేశాడు. ఇంకా పలువురు కూడా ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌ మాత్రమే ఈ తరహా పాత్రలు చేయగలడని, విలనిజంను చూపించడంలో ఎన్టీఆర్‌ నటన పీక్స్‌కు చేరిందని అంటున్నారు.

ఇన్నాళ్లు రాముడిగా మెప్పించిన ఎన్టీఆర్‌ రావణుడిగా మెప్పించడం ఖాయంగా టీజర్‌తోనే తేలిపోయింది. జై టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో సినిమాను పూర్తి చేసి అనుకున్న సమయంకు సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ముద్దుగుమ్మలు రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటిస్తున్నారు.

To Top

Send this to a friend