ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై ఎంతో జాగ్రత్తగా చిత్ర యూనిట్ సభ్యులు ఉంటున్నారు. అంతా బాగానే ఉన్నా ఈ చిత్ర టీజర్ యూనిట్ సభ్యుల ద్వారానే లీక్ అవ్వడం సంచలనం సృష్టించింది. అయితే ఆ విషయం మరీ సీరియస్ కాకుండానే బాబీ అండ్ టీం జాగ్రత్త పడ్డారు.
ఆగస్టులో ‘జై లవకుశ’ టీజర్‌ను వదలాని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌లు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుండి టీజర్ కట్టింగ్ జరుగుతుంది. టీజర్ కోసం కొంత ఫుటేజ్‌ను ఎడిటర్‌కు ఇవ్వడం జరిగింది. ఆ ఫుటేజ్ ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రొడక్షన్ టీం వెంటనే సైబర్ పోలీసుల సాయంతో ఆ ఫుటేజ్‌ను వెబ్ మీడియాలో లేకుండా చేయగలిగారు.
ఆ లీక్‌కు పాల్పడ్డ వారిని కూడా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లీక్ వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అంటూ పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం లీక్‌కు పాల్పడిన వ్యక్తం పోలీసుల అదుపులో ఉన్నాడు.
