జై టీజర్‌ వ్యూస్‌ వెనుక!

 

ఇప్పటి వరకు ఏ సౌత్‌ చిత్రం కూడా సాధించని వ్యూస్‌ను ‘జై టీజర్‌’ రాబట్టడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. కేవలం ఒక్క రోజులో దాదాపు 8 మిలియన్‌ల వ్యూస్‌ను యూట్యూబ్‌ మరియు ఫేస్‌బుక్‌లో దక్కించుకోవడం సంచలనం అయ్యింది. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయి అనేది ఈ టీజర్‌తో తేలిపోయిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

యాంటీ నందమూరి ఫ్యాన్స్‌ మాత్రం టీజర్‌ వ్యూస్‌ వెనుక చీటింగ్‌ ఉందనే విమర్శలు చేస్తున్నారు. జై టీజర్‌ను యూట్యూబ్‌ వ్యూవర్స్‌పై బలవంతంగా రుద్దారని, అంటే యాడ్స్‌ రూపంలో జై టీజర్‌ను ప్రసారం చేశారు. జాతీయ మరియు అంతర్జాతీయంగా బాగా ఫేమస్‌ అయిన యూట్యూబ్‌ ఛానెల్స్‌లో ఈ టీజర్‌ను ప్రసారం చేయడం జరిగింది. దాంతో ఆ కౌంట్‌ కూడా వ్యూస్‌గా పెరిగాయి. దాంతో ఈ స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి అనేది కొందరి వాదన.

విమర్శల విషయం ఎలా ఉన్నా కూడా టీజర్‌ మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌లోని విలనిజంను చూసి షాక్‌ అవుతున్నారు. మళ్లీ మళ్లీ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా టీజర్‌ను చూశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌ నిర్మాణంలో ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

To Top

Send this to a friend