జై.. కోటీశ్వరుడు

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఆ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. మూడు పాత్రల్లో ఒక్క పాత్ర అయిన జైకు సంబంధించిన పాత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ మొదటి రోజే 75 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక 48 గంటలలోపే ఏకంగా కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది.

ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు, ఏ సౌత్‌ సినిమాకు రానంతగా ఈ సినిమాకు కలెక్షన్స్‌ వచ్చాయి. రికార్డులు బ్రేక్‌ చేసిన టీజర్‌పై కొందరు విమర్శలు చేస్తున్నా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం కోటి వ్యూస్‌ అంటూ గొప్పగా ప్రకటించారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఏంటి అనేది ఈ టీజర్‌ను చూస్తుంటేనే అర్థం అవుతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. మొదటి సారి నందమూరి కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ల కాంబోలో వస్తున్న సినిమా అవ్వడం వల్ల కూడా సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

To Top

Send this to a friend