ఎన్టీఆర్ జైలవకుశ ఇదేనా.?

ప్రస్తుతం సగటున ఏడాదికి ఒక సినిమా చేస్తూ భారీ గ్యాప్ పాటిస్తున్న ఎన్టీఆర్ ఇక అభిమానులకు చేరువ కావాలని డిసైడ్ అయ్యారు. టెంపర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని తీసిన జనతా గ్యారేజ్ సినిమా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జై లవ కుశ సినిమాతో ఎన్టీఆర్ మనముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే అభిమానులకు మరింత చేరువ కావాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ గురించి ఓ హాట్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. జైలవ కుశ స్టోరీ ఇదేనంటూ తీవ్ర చర్చ జరుగుతోంది.. ఫిలిం సర్కిల్స్ చెబుతున్న ప్రకారం జై లవకుశ కథ ఏంటంటే..

‘ఇద్దరు కవల సోదరులు.. వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న.. ఈ ముగ్గురికి ఒకే తండ్రి.. కానీ ఇద్దరు తల్లులు.. ఇందులో మొదటి భార్యకు పుట్టినవాడే జై. రెండో భార్యకు పుట్టినవారు లవ, కుశలు.. అయితే తండ్రివల్లే తన తల్లి చనిపోయిందని.. ఎలాగైనా తండ్రిని, సవతి తల్లిని, వారి పిల్లలను చంపాలని జై ప్రయత్నిస్తుంటాడు.. తల్లి చనిపోవడం.. తండ్రి చిన్నప్పుడే జైని వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాసాలకు అలవాటు పడి గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు.. మరోవైపు తండ్రితోనే ఉంటూ లవ, కుశలు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులుగా నటిస్తూ పొట్టపోసుకుంటారు.. ఇక డ్రామాలు వేసే తమ్ముళ్లకి, రౌడియిజం చేసే అన్నయ్యకు మధ్య నడిచే కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తాజా సమాచారం.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం.. ముఖ్యంగా ఎన్టీఆర్ నత్తి విలన్ జై పాత్రలో ఇరగదీశాడని చిత్రం యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాలో పోసాని కీలక పాత్ర పోషిస్తున్నారట.. సినిమా మొత్తం పోసాని చుట్టూనే తిరుగుతుందని సమాచారం. మరి ఈ కథ అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాల్సిందే..

To Top

Send this to a friend