జయ జానకీ నాయక రివ్యూ..

లెజెండ్, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత ఫుల్ ఓల్టేజ్ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయ జానకీ నాయక’ ఇవాళ విడుదలైంది. సహజంగానే బోయపాటి అంటే మాస్ లో పిచ్చ క్రేజ్. ఆయన బాలక్రిష్ణ సహా అందరూ హీరోలతో మాస్ మాసాల సినిమాలు తీసి భారీ హిట్లు కొట్టాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో జయ జానకీ నాయకపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. దీంతో సినిమా పై అంచనాలను అందుకుందాం లేదా తెలుసుకుందాం..

కథ:
ఫుల్ మాస్ మసాలా స్టోరీలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. కేంద్ర మంత్రి పవార్ పాత్రలో సుమన్ విలనిజం చూపించారు.. ఆయన కుమారుడు కాలేజీలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అతడి అల్లరికి భయపడి ఓ అమ్మాయి టీసీ తీసుకొని వెళ్లిపోతుంది. ఆమెను తోటి స్టూడెంట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆపుతుంది. అది గమనించిన సుమన్ కొడుకు హీరోయిన్ రకుల్ పై కూడా దౌర్జన్యం చేయాలనుకుంటాడు. అప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతడి తండ్రి శరత్ కుమార్, సోదరుడు నందు లు దౌర్జన్యాన్ని అడ్డుకొని సుమన్ కొడుకుకు బుద్ధి చెబుతారు. దీన్ని మనసులో పెట్టుకొని కేంద్ర మంత్రి హీరో బెల్లంకొండపై ఏవిధంగా రివేంజ్ తీసుకున్నాడన్నదే స్టోరీ..

విశ్లేషణ:
బోయపాటి తన మార్క్ మాస్ మసాలా జోడించిన జయ జానకీ నాయక’ చిత్రాన్ని బోయపాటి చాలా రిచ్ గా తీశారు. భారీ బడ్జెట్ పెట్టినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. పెళ్లి పీటల మీదే భర్తను పోగొట్టుకున్న హీరోయిన్ అనే కాన్సెప్ట్ తో సినిమా ఆసక్తికరంగా మారడం సినిమాలోని కొత్త పాయింట్. అయితే సినిమాలో పెద్దగా హాస్యపు సన్నివేశాలు కనిపించకపోవడం పెద్ద మైనస్. ఇలాంటి కథాంశంతో తెలుగు తెరపై సినిమా రాకపోవడంతో ఈ స్టోరీ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు హీరోతో బోయపాటి అద్భుతంగా పలికించాడు. మొత్తం మీద ఇది బోయపాటి మార్క్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పక నచ్చే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend