జై విలన్, లవ సాఫ్ట్.. మరి కుశ.?

ఇప్పటికే జైలవకుశలోని జై పాత్రను పరిచయం చేస్తూ చిత్ర దర్శకుడు బాబీ ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రావణుడి లాంటి విలన్ పాత్రలో నత్తి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ విలనిజం ఆకట్టుకుంది. ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలను ఎన్టీఆర్ మరింత పెంచేశాడు. ఆ టీజర్ లో ఎన్టీఆర్ నటన సూపర్ అంటూ ఆయన అభిమానులు సందడి చేశారు..

ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా లవ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. జై పాత్రలోని నెగెటివ్ షేడ్ కు.. లవ పాత్రలోని షేడ్ కు కంప్లీట్ వైవిధ్యాన్ని చూపించారు. లవకుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ చాలా కూల్ గా.. ఎటువంటి హడావుడి లేకుండా కనిపించారు. బృందావనం సినిమాలోలా సాఫ్ట్ క్యారెక్టర్ లో లవ పాత్ర ఉండబోతోందని ఆ పోస్టర్ చూశాక అర్థమవుతోంది. ఇన్ షర్ట్ టక్ తో చిరు గడ్డంతో ఓ ఉద్యోగిలా ఎన్టీఆర్ ఆ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. .

జైలవ కుశ.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా.. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా విశేషాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్ తో భారీ హిట్ కొట్టినా అంతకుముందు కూడా వరుస విజయాలను అందుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆ హ్యాట్రిక్ విజయాలను కొనసాగించాలని పట్టుదలతో ముందుకువెళుతున్నారు.. మరో సారి విభిన్నమైన కథతో జైలవకుశ సినిమా తీస్తున్నారు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాడు. లవ పేరుతో విడుదల చేసిన లుక్ కు మంచి క్రేజ్ వస్తోంది. ఈ పాత్రలో సాఫ్ట్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడని అర్థమైంది.

To Top

Send this to a friend