తప్పు చేస్తున్నావ్ జగపతి బాబు..

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఇప్పుడు దక్షిణాదిలోనే జగపతి బాబు ఫుల్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. 15 ఏళ్ల క్రితం వరకు ఆయన తెలుగులో టాప్ హీరో. కానీ ఆ తర్వాత సినిమాలు హిట్ కాక.. మరుగునపడిపోయారు. చాలా కాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. హీరోగా జగపతి బాబు అంతర్థానమైపోయారు అనుకున్న సమయంలోనే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, బాలయ్య హీరోగా తీసిన లెజెండ్ సినిమాతో అవకాశం ఇచ్చి మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో నిలబెట్టి జగపతికి పునర్జన్మ ప్రసాదించారు.

అయితే జగపతి మరోసారి పాత తప్పునే చేస్తూ కెరీర్ ను పాడుచేసుకుంటున్నారు. ‘పటేల్ సార్’ అనే చిత్రంలో జగపతి హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈనెల 14న సినిమా విడుదల కాబోతోంది. సాయి కొర్రపాటి నిర్మాత.. అప్పులై పాలై కుదేలైన జగపతి బాబు కాసిన్ని డబ్బులు వచ్చి ఆర్థికంగా నిలుదొక్కుంటున్న సమయంలోనే ఇప్పుడు మళ్లీ హీరోగా మారి చేతులు కాల్చుకునే పనిలో పడ్డారు.

ప్రస్తుతం జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, మళయాళం కన్నడల్లో కాల్షీట్లు ఇస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ పటేల్ సార్ సినిమాకోసం జగపతి పలు కాల్షీట్లు రద్దు చేసుకొని సినిమాలను వదులుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఫామ్ తో దూసుకెళ్తున్న సమయంలో మళ్లీ హీరోగా ప్రయత్నించి జగపతి తప్పు చేస్తున్నారనే చెప్పాలి.

సునీల్ లాంటి ఫుల్ కమెడియన్ కూడా హీరోగా మారి చేతులు కాల్చుకొని ఇప్పుడు అవకాశాలు లేక ఢీలాపడిపోయాడు. జగపతి బాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. ఆర్టిస్టుగా నాలుగు సినిమాలు చేయాల్సింది పోయి హీరోగా చేస్తూ పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య కూడా జగపతి బాబును హెచ్చరిందట.. ఇలా జగపతి బాబు ఫుల్ స్వింగ్ లో మళ్లీ హీరోగా మారుతూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.

To Top

Send this to a friend