జగన్ కు నచ్చిన ఉత్తమ టీడీపీ ఎమ్మెల్యే.?


ప్రస్తుతం ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడాలు, తోపులాటలు బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ మనసు దోచేశాడు ఓ టీడీపీ ఎమ్మెల్యే.. హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ నటుడు బాలక్రిష్ణ మొత్తం తెలుగు దేశం ఎమ్మెల్యేల్లోనే ఉత్తమ ఎమ్మెల్యే అంటూ జగన్ కితాబిచ్చాడు.

అసెంబ్లీ బయట కదిరి ఎమ్మెల్యేతో పిచ్చాపాటిగా మాట్లాడిన జగన్ ఈ సందర్భంగా తన అభిమాన నటుడు, టీడీపీలో ఉత్తమ ఎమ్మెల్యే వివాదరహితుడు బాలక్రిష్ణ అంటూ వేయినోళ్ల పొగిడారు. ‘బాలక్రిష్ణ ఎ్వరినీ విమర్శించరని.. లేనివి మీదేసేకొని మాట్లాడరని.. మంచి మాటలే మాట్లాడే బాలయ్య అంటే తనకు ఇష్టమని.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరిలోకి బాలయ్య బెస్ట్ ’ అంటూ జగన్ కదిరి ఎమ్మెల్యేతో అన్నాడట.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

కాగా వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఆదినుంచే బాలయ్య అంటే పిచ్చ అభిమానం.. జగన్ అభిమాన హీరో బాలయ్యనే.. ఇది బహిరంగ రహస్యమే.. జగన్ చదువుకునే సమయంలో బాలయ్య అభిమాన సంఘానికి నాయకుడిగా పనిచేశాడు. అంత వీరాభిమానం ఉన్నా వైకాపా అధ్యక్షుడిగా ఎదిగాక ఎప్పుడు బాలయ్య గురించి తీయని జగన్ ఇప్పుడు తన అభిమానాన్ని ప్రదర్శించారు. దీనికి బాలయ్య ఏమంటాడో వేచిచూడాలి..

To Top

Send this to a friend