అధికారం కోసం జగన్ మహాసంకల్పం..

అధికారం కావాలంతే.. అందు కోసం ఏమైనా.. ఎందాకైనా.. ఓవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే జగన్.. ఢిల్లీ నుంచి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తీసుకొచ్చి ఆయన సూచనల ప్రకారం పాదయాత్రకు, పలు పథకాలకు రూపకల్పన చేశారు. మరోవైపు జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ చెలిమికి అర్రులు చాస్తున్నారు. ఆ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో బరిలోకి దిగాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి వర్కవుట్ అవుతాయో కావో కానీ ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది..

జగన్ సీఎం కావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మహా యాగానికి సంకల్పించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావాలని.. జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ‘శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగానికి ’ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని మలక్ పేటలో గల వేద పండితుడు శివరామ ప్రసాద్ శర్మ ఇంట్లో శనివారం ఈ మహాయాగాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు..

ఈ యాగం ఇప్పటి నుంచి నిరంతరం 2019వరకు అంటే రెండేళ్ల పాటు ఫలితాలు వెలువడి జగన్ సీఎంగా ఎన్నికయ్యే వరకు నిర్వహిస్తారట.. ఫలితాలు విడుదలయ్యాక జగన్ ఈ యాగ ముగింపు పూర్ణాహుతికి హాజరవుతారని తెలిపారు. ఇలా జగన్ సీఎం కావడానికి గల ఏ ఒక్క అవకాశాన్ని.. సెంటిమెంటును వదలకుండా వైసీపీ నాయకులు ముందుకెళ్తున్నారన్నమాట..

To Top

Send this to a friend