జగన్ వెళ్లిన పని..? చేస్తున్న పని..?


ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఎక్కే గడప.. దిగే గడపలాగా రాష్ట్రపతి నుంచి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలను కలిసి విన్నవిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా టీడీపీలోకి తీసుకొని మంత్రి పదవులు సైతం కట్టబెట్టారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ వైఎస్ జగన్ రాష్ట్రపతికి నివేదించారు..

కాగా జగన్ పర్యటనపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. ఢిల్లీకి వచ్చిన జగన్ ఏపీలో ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాల్సింది పోయి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నాడని ఆరోపించారు. ఈడీ కేసులో కష్టాలు రావడంతోనే జగన్ కు ఢిల్లీ గుర్తొంచ్చిందని జేసీ విమర్శిచారు. దేశంలోనే ఎక్కడ చూసినా మిశ్రమ మంత్రివర్గాలే ఉన్నాయని.. జగన్ అహంకారం.. దురుసు ప్రవర్తనతోనే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని అన్నారు. కులం, ప్రాంతం, సామర్థ్యం కారణంగానే సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారని జేసీ వివరించారు..

జేసీ ఆరోపించినట్టు జగన్ పార్టీ ఫిరాయింపులతో పాటు తనకు అనుకూలురు దగ్గరి వాళ్లతో రహస్యంగా భేటి అవుతున్నట్టు సమాచారం. ఇటీవల బీజేపీలో వైసీపీ విలీనంపై ఆఫర్ వచ్చినా దరిమిలా దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో గెలిస్తే విలీనం చేస్తానని.. ఈడీ, సీబీఐ కేసులు ప్రస్తుతానికి వాయిదా వేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend