జగన్ సూట్‌కేస్ కంపెనీ!

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా నల్లధనంపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) జరిపిన దాడుల్లో జగన్‌కు చెందిన ఓ సూట్‌కేస్ కంపెనీ బయటపడింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో వంద చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. రూ. 3.04 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది.

ముంబైలో ఒకే అడ్రస్‌తో 700 సూట్‌కేస్‌ కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అందులో రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్టు కంపెనీ పత్రాలను పరిశీలించిన ఈడీ.. అది జగన్‌కు చెందినదిగా గుర్తించింది. నోట్ల రద్దు సమయంలో రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్టు కంపెనీ నుంచి రూ. 1478 కోట్లను హాంకాంగ్‌కు మళ్లించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరించింది. జగన్‌కు చెందిన షెల్ కంపెనీ ద్వారా రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి ఈ రూ. 1478 కోట్లు చేరినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యాజమాన్యంతో జగన్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. రాజేశ్వర్ ఎక్స్‌పోర్టు యజమాని అయిన కృతికను ఫిబ్రవరి 27న అరెస్టు చేశారు. రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీతో జగన్‌కు ఉన్న సంబంధాలను తెలుసుకోవడం కోసం ఆయనను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యాదవ్‌సింగ్‌, చగన్‌భుజ్‌భల్‌ కంపెనీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 700 సూట్‌కేస్‌ కంపెనీల్లో 20 మంది డమ్మీ డైరెక్టర్స్‌ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఛగన్‌భజ్‌భల్‌ కోసం రూ. 46.7 కోట్ల పాతనోట్లు మార్పిడి జరిగినట్లు ఈడీ సోదాల్లో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వజ్యోతి రియల్టర్స్‌ కంపెనీకి సంబంధించిన రూ. 3.04 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.

To Top

Send this to a friend