జగన్ ప్లాన్.. బాబు హైరానా..


జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఏదో మతలబు ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ మోడీ.. జగన్ ను కలవడానికి అనుమతిస్తే.. ఏపీ రాజకీయ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది. జగన్-మోడీ మిలాఖత్ రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం కలిగి ఉంటుంది.

2019 ఎన్నికలు జగన్ కు అత్యంత కీలకం.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే.. పొత్తుపెట్టుకొని అయినా పొత్తు లేకుండా అయినా అధికారంలోకి వస్తేనే జగన్ కు మనుగడ.. లేదంటే జగన్ రాజకీయ భవిష్యత్ నాశనమవుతుంది. దాంతో అక్రమాస్తుల కేసులు చుట్టుముట్టి జైలు పాలు కావాల్సిందే..ఈ నేపథ్యంలో ఎలాగైనా మోడీని కలిసి 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఏపీలో గెలవాలని వైసీపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే వైసీపీ సీనియర్ లీడర్లు.. ఢిల్లీ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

ఇటీవలి పరిణామాలు కూడా మోడీని కలవడానికి జగన్ కు విపత్కర పరిస్థితులు సృష్టించాయి. అక్రమాస్తుల కేసు, షెల్ కంపెనీలతో బంధాలపై ఈడీ, సీబీఐ జోరుపెంచడంతో జగన్ కు ఆందోళన ఎక్కువైంది. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ హవా ఖాయం అని తేలడంతో ఎలాగైనా బీజేపీ జత కట్టడం మేలని జగన్ భావిస్తున్నారు. బీజేపీకి జనసేన అధ్యక్షుడు పవన్ దూరం కావడం.. వచ్చేసారి టీడీపీ గెలుస్తుందన్న నమ్మకం బీజేపీలో కొరవడడం కూడా వైసీపీతో కలిసి సాగడానికి దారులు తెరుస్తున్నాయి..

2019 ఎన్నికల్లో మోడీ కనుక జగన్ తో కలిస్తే అది జగన్ కు బాగా ప్లస్ అవుతుంది. మోడీ చరిష్మాతో గెలుపుబావుటా.. దాంతో అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగం తగ్గి రాజకీయంగా, కేసుల పరంగా జగన్ కు గొప్ప ఊరట లభించే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు దేశంలో, బీజేపీలో మోడీ చెప్పిందే శాసనం.. నేరుగా ఆయనతో బేటి అయ్యి పొత్తుపొడుపులపై ముచ్చటిస్తే జగన్ ఆశయం నెరవేరుతుంది. అందుకే జగన్ అండ్ కో ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ మోడీ నుంచి ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు రాలేదు.

కాగా జగన్ వేసిన ఢిల్లీ-మోడీ మీటింగ్ ప్లాన్, చంద్రబాబులో గుబులు రేపుతోంది. ఒకవేళ.. వైసీపీతో పొత్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మోడీ ఏపీలో దిగితే టీడీపీ తట్టుకోవడం కష్టం.. అందుకే ఎలాగైనా మిత్ర స్నేహం మోడీ పాటించేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. చంద్రబాబుకు ఉన్న పరిచయాల ద్వారా వైసీపీతో పొత్తు పెట్టుకోవద్దని అమిత్ షా , ఇతర నేతలతో చంద్రబాబు రహస్యంగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. సో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో వెళితే.. ఆ పార్టీకి గెలుపు ఖాయం.. అది జగన్ తోనా.. చంద్రబాబుతోనా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend