ఉండవల్లితో జగన్ మాస్టర్ ప్లాన్..

రాజకీయ నాయకుల్లో మాటల మాంత్రికుడిగా.. రాజకీయ విశ్లేషణలు చేయడంలో పట్టున్న వ్యక్తిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు మంచి పేరుంది. ఆయన రాజకీయ ప్రసంగాలు చాలా పకడ్బందీగా.. వివరణాత్మకంగా ఉంటాయి. ఢిల్లీ నుంచి ఏ జాతీయ నాయకుడు వచ్చినా కూడా తెలుగులో ఆయనే ట్రాన్స్ లేట్ చేసేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మినబంటుగా.. ప్రత్యర్థులు చంద్రబాబు, రామోజీరావులను ఉండవల్లి ఓ ఆట ఆడేశారు. అయితే ఎప్పుడైతే ఏపీ విడిపోయి తెలంగాణ ఏర్పడిందో ఇక ఉండవల్లి తెరమరుగైపోయారు.

అయితే ఇటీవల మళ్లీ ఉండవల్లి పేరు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ మధ్య యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఆయన పాల్గొంటున్నారు. టీడీపీ మంత్రితో అభివృద్ది విషయంలో సవాల్ విసిరి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటం నెట్టారు. చంద్రబాబు అభివృద్ధి నీటి మీద రాతలంటూ విమర్శిస్తున్నారు. ఉండవల్లి ఇంత యాక్టివ్ గా ఏపీ రాజకీయాల్లో రావడం ఏమిటై ఉంటుదన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. టీడీపీ అంటే పడని ఉండవల్లి ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటూ విమర్శిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మనుగడ ఏపీలో కష్టమేనని తేలిపోయింది. అందుకే జగన్ ఉండవల్లికి గాలం వేస్తున్నట్టు సమాచారం. జగన్ తన 2019 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఉండవల్లిని నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.. ఉండవల్లిని ఎలాగైనా వైసీపీలో చేర్చుకునేలా ఆయనతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఉండవల్లి జగన్ కోరిక మేరకు వైసీపీలో చేరుతారా లేదా అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను ఊపేస్తోంది. కాంగ్రెస్ మాజీలను అక్కున చేర్చుకొని 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. అయితే ఈ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూడాలి.

To Top

Send this to a friend