జగన్ కు కేసులుపోయి సీఎం పీఠం..


ఉగాది అంటే అదో ఉత్సాహం.. కొత్త హేవళంబి నామ సంవత్సరం.. ఈరోజు అందరూ కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉందో ఖచ్చితంగా చూసుకుంటారు. పండితులు, బ్రాహ్మణులు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కాకుండా నిజమైన పంచాంగం వేసి భవిష్యత్తు చెప్పేవారు.. కానీ ఇప్పుడా ట్రెండ్ మారింది. పంచాంగానికి రాజకీయ రూపు వచ్చింది.

తెలంగాణలో కేసీఆర్ నిర్వహించిన పంచాంగానికి ఆయనకు అనుకూల శ్రవణం జరిగింది. చంద్రబాబుకు మంచి రోజులని పండితులు చెప్పారు. ఇక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగంలో జగన్ కు అనుకూలంగా పంచాంగ శ్రవణం వినింపింది. ఏకంగా జగన్ కు ఉన్న కేసులన్నీ పోయి సీఎం పీఠం వరిస్తుందని పంచాగకర్త రామచంద్ర శాస్త్రి చెప్పారు.

‘2019 లో అంతా ఏకపక్షంగా ఉంటుంది. ఈసారి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే.. మూడేళ్లలో జగన్ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. సర్వేలన్నీ 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని చెబుతున్నాయి. గ్రహాల దృష్ట్యా మిత్రులందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం జగన్ కు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి.. అదే సమయంలో ఓపికతో అడుగులు వేయాలి..’ అంటూ జగన్ పంచాంగాన్ని బ్రాహ్మణ అయ్యవారు చెప్పారు..

ఇలా కేసీఆర్ కు, చంద్రబాబుకు, జగన్ కు పాజిటివ్ గా చెప్పారు. ఒకే సారి అధికారం నిలబెట్టుకుంటారని జగన్ కు, చంద్రబాబుకు సూచించారు. వీరిద్దరు ఒకే సమయంలో ఏపీకి సీఎం అవ్వడం అనేది అసాధ్యం.. మరి పండితుల ఈ రాజకీయ పంచాంగంలో ఎవరిది కరెక్టో.. రాంగో తెలియాలంటే 2019వరకు ఆగాల్సిందే..

To Top

Send this to a friend