అధికారం నుంచి ప్రతిపక్షంలోకి..

ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలిచినా సరే.. తర్వాత పార్టీలు ఫిరాయించి అధికారపక్షం పంచన చేరుతున్నారు. తెలంగాణలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి ఏకంగా మంత్రి అయ్యాడు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ కూడా టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యాడు. ఇలా అధికారం అంటే అంత తీపి.. కానీ ఏపీలో అధికారంలో ఉండి.. బాధ్యతాయుత ఎమ్మెల్సీ పదవిలో ఉండి.. అందునా అధికారంలో ఉన్న టీడీపీలో ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం సంచలనమైంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున శిల్పా పోటీ చేయబోతున్నారు. నిజానికి రాజీనామా చేస్తేనే శిల్పాకు టికెట్ ఇస్తానని జగన్ స్పష్టం చేశారట.. విలువలతో పార్టీ నడుపుతున్నానని.. అందుకే టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీచేయాలని స్పష్టం చేశాడట.. జగన్ పై ఉన్న నమ్మకం.. నంద్యాలలో గెలుస్తామన్న ధైర్యంతో శిల్పా మోహన్ రెడ్డి ఇలా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.

భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటు ఇరు పక్షాలకు కీలకంగా మారింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ పోరాడుతున్నాయి. అధికార టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచి వాళ్ల సోదరుడి కొడుకు బ్రహ్మానందరెడ్డి పోటీపడుతున్నారు. ఇటు వైసీపీ తరఫున టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠం ప్రస్తుతం రాజ్యమేలుతోంది.

కాగా వైసీపీ తరఫున గెలిచిన దాదాపు 20 మంది వరకు ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలో కలిపేసుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. దీనిపై జగన్ కోర్టుకు వెళ్లడం, స్పీకర్ ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు తీరుపై ఎన్నో విమర్శలు చేశాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉండి వైసీపీ తరఫున పోటీచేస్తే ఆ విమర్శలు తనపై కూడా వస్తాయని భావించి ధైర్యంగా శిల్పాతో రాజీనామా చేయించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉందని.. తాను విలువలకు కట్టుబడి రాజీనామా చేయించి పోటీచేయిస్తున్నానని.. దమ్ముంటే చంద్రబాబు నాలా వైసీపీ నుంచి గెలిచిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకొని మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

జగన్ చేసిన ఈ పని రాజకీయంగా ఆయనకు మంచి మార్కులు పడేట్టు చేయగా.. అధికార టీడీపీకి శిల్పా రాజీనామా బలంగా తగిలింది. జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా టీడీపీని ఇరుకునపెడుతోంది.

To Top

Send this to a friend