జగన్ పెద్ద స్టెప్.. వార్ రెడీ..


వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి పని మొదలు పెట్టారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని వీరు సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీకి, వైసీపీకి నియోజకవర్గాల్లో బలం, బలగం.., ఎవరు సరైన అభ్యర్థి అనే విషయంపై ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తున్నట్టు సమాచారం. విపక్ష నేత జగన్ వ్యవహార శైలి, రాజకీయ పోకడలపై ప్రజలు , పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

ఇటు నియోజకవర్గాలతో పాటు ఇటు వైసీపీకి చెందిన కొందరు నాయకులను కూడా ప్రశాంత్ కిషోర్ బృందం ఇంటర్వ్యూ నిర్వహించారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై వైసీపీ నేతలకు వివరించినట్టు తెలిసింది. సర్వే బృందం సిఫారసులను బట్టి జగన్ టికెట్లు ఇస్తాడా లేదా సన్నిహితులకే టికెట్లు కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాల్సిందే..

మొత్తానికి జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు రెండేళ్ల ముందే పని మొదలుపెట్టాడు. ఎవరు గట్టి అభ్యర్థులు, ఎవరిని దింపితే వైసీపీ గట్టెక్కుతుందనే విషయాలను ఆరా తీస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమిని దెబ్బకొట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే, నివేదికలు ఆధారంగా జగన్ ఏపీలో ఎన్నికలకు వెళ్తుండడంతో టీడీపీ శిభిరంలో గుబులు మొదలైనట్టు సమాచారం.

To Top

Send this to a friend