జగన్ బెయిల్ రద్దు పిటీషన్..


అక్రమాస్తుల కేసులో దాదాపు 11 కేసులను సీబీఐ వైఎస్ జగన్ మోహర్ రెడ్డిపై మోపింది. ప్రతీ శుక్రవారం కోర్టులో హాజరు కావాలని కోరినా.. జగన్ మినహాయింపు పొందుతూ వస్తున్నారు. కాగా ఇటీవల సాక్షి న్యూస్ చానల్ లో రమాకాంత్ రెడ్డితో ఓ ఇంటర్వ్యూ ప్రసారమైంది. జగన్ కేసులో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి .. జగన్ పై సీబీఐ మోపిన కేసులు నిరూపితం కావని.. అవన్నీ తేలిపోతాయని చెప్పారు. ఈ మాటలను విన్న సీబీఐ.. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని.. జగన్ బెయిల్ రద్దు చేయాలని నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. కౌంటర్ పిటీషన్ లో జగన్ పేర్కొన్నారు. సీబీఐ అధికారులతో జరిపిన సంభాషనలను మాత్రమే రమాకాంత్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారని వివరించారు. దీంతో నాంపల్లి కోర్టు ఈ విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

To Top

Send this to a friend