బిగ్‌బాస్‌లో జబర్దస్త్‌


హిందీలో ప్రేక్షకుల విశేషాధరణ పొందిన బిగ్‌బాస్‌ షోను తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీ తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రెండు ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. రోజు రోజుకు ఆసక్తి భారీగా పెరిగి పోతుంది. ప్రస్తుతం స్టార్‌ మాటీవీ వారు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనేందుకు సెలబ్రెటీల ఎంపిక చేస్తున్నారు. సినిమా పరిశ్రమ నుండి గుర్తింపు ఉన్న వారు పెద్దగా స్టార్‌ మాకు ఓకే చెప్పడం లేదు. దాంతో చేసేది లేక జబర్దస్త్‌తో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్‌ను అప్రోచ్‌ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే ధనరాజ్‌ బిగ్‌ బాస్‌ షోకు ఎంపిక అయ్యాడు. ఈయనతో పాటు మరో ఇద్దరు కూడా జబర్దస్త్‌ కమెడియన్స్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్‌ ఆడియన్స్‌ అంటే ఒకరకమైన చులకన భావం ఉంటుంది. అలాంటి జబర్దస్త్‌ కమెడియన్స్‌ను బిగ్‌బాస్‌ షోలో ఎంపిక చేయడం అంటే షోను కంపు చేయడమే అని నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మరి కొందరు అంటున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురును జబర్దస్త్‌ నుండి ఎంపిక చేయడం అంటే కాస్త సాహస నిర్ణయమే అని అంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ షోలో కూడా జబర్దస్త్‌ కనిపించనుంది. జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ లేదా అనసూయలు బిగ్‌ బాస్‌ షోలో కనిపించే అవకాశం ఉంది.

To Top

Send this to a friend