జబర్దస్త్ వినోద్ ఆత్మహత్యాయత్నం


పాపం.. జబర్దస్త్ లో ఆడవేషాలు వేసినందుకు… బుల్లితెర నటుడు వినోద్ ను బయట కూడా ఆడపిల్లగానే ట్రీట్ చేసినట్టున్నారు వారి తల్లిదండ్రులు… అందుకే రాష్ట్రవ్యాప్తంగా తన నటనా కౌశలంతో అభిమానులను సంపాదించుకొని ఫేమస్ అయినా కూడా వినోద్ కు కన్నవారి నుంచి బలవంతాలు తప్పలేదు. తనకు ఇష్టం లేకుండా వివాహం జరిపిస్తున్నారని జబర్దస్త్ ఫేం వినోద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మణికట్టుపై కత్తితో కోసుకున్నాడు.

వినోద్ స్వస్థలం కడప. హైదరాబాద్ వచ్చి జబర్దస్త్ సహా పలు షోల్లో పాల్గొంటున్నాడు. ఇతడి కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లా సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో పెళ్లి చేసేందుకు బలవంతగా నిశ్చయించారు. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వినోద్.. కుటుంబ సభ్యులకు వివరించినా ఒప్పుకోలేదు. దీంతో తన మణికట్టును గాయపరుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వినోద్ పెళ్లిని నిలిపివేశారు. వినోద్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం వినోద్ జబర్ధస్త్ లో ఆడవేషాలకు పెట్టింది పేరు. చమ్మక్ చంద్రతో పాటు చాలామంది టీం లీడర్లు ఆడవేషాలకు వినోద్ నే తీసుకుంటారు. ఫుల్ ఫాంలో ఉన్న వినోద్ ఇప్పుడిప్పుడే తన కేరీర్ ను బిల్డప్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో పెళ్లి వద్దని కుటుంబసభ్యులకు చెప్పినా వారు వినలేదు. పెళ్లి చేయాలని చూడడంతో ఇలా ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా హైదరాబాద్ లో ప్రేమ వ్యవహారమే వినోద్ ఆత్మహత్యకు మరో కారణమని బంధువులు అనుమానిస్తున్నారు.

To Top

Send this to a friend