రెడ్డప్ప ఇక విమానం ఎక్కలేడు..

చూడప్ప రెడ్డప్ప.. నువ్ అనంతపురంలో సింహం లాంటివాడివి కావచ్చు.. కానీ అది దేశీయ పరిశ్రమ అక్కడ సిబ్బందిని కొడితే ఊరుకుంటారా.. చూడు.. ఇప్పుడు విమానం ఎక్కకుండా అయిపోయినవ్.. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం పాపం జేసీ దివాకర్ రెడ్డి ఇక పై దేశీయ విమానయాన సంస్థల్లో ఏ విమానంలో కూడా ప్రయాణించకుండా పోయాడు. దీనికంతటికి ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణం..

జేసీ దివాకర్ రెడ్డి అప్పట్లో ఢిల్లీ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. దీంతో జేసీ పై ఎయిర్ లెన్స్ సంస్థలన్నీ కలిసి తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. దీంతో ఢిల్లీకి వెళ్లే దారి లేక పాపం జేసీ సొంతం ప్రైవేటు జెట్ ను అద్దెకు తీసుకొని అందులో వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశాడు. ఢిల్లీలోని ఆర్థికమంత్రి జైట్లీని కలిసినా ఆయనేం చేయలేను.. పోయి విమానయాన సంస్థలకు బతిమిలాడుకో అని సమాధానం ఇచ్చారట.. దీంతో చేసేందేం లేక జేసీ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విమానయాన సంస్థలు వేసిన నిషేధాన్ని తొలగించాలని అభ్యర్థించాడు.

‘నీకు బస్సు ట్రావెల్స్ ఉన్నాయి. ఆ బస్సులో ఎవరైనా లొల్లి చేస్తే ఎక్కనిస్తారా.. అదీ అంతే.. విమానాశ్రయ సిబ్బందిపైనే దాడి చేస్తే వారు ఊరుకుంటారా.? అందుకే మీపై నిషేధం విధించారు. అయినా స్వయంగా ట్రావెల్స్ నడుపుతున్న మీకు ఇలా సంఘటనలు తెలియనివి కావు.. మీపై విధించిన నిషేధానికి స్టే విధించలేం’ అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది.. దీంతో రెడ్డప్పకు ఇప్పట్లో విమానం ఎక్కే భాగ్యం లేకుండా పోయింది.

To Top

Send this to a friend