చంద్రబాబు మెడకు ‘బ్రాహ్మణ ఉచ్చు’

అటు తిరిగి మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఐవైఆర్ కృష్ణారావు సస్పెన్షన్ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకుంది. తన సస్పెన్షన్, అందుకు గల కారణాలు, చంద్రబాబు తనను ఎందుకు సస్సెండ్ చేశారో కారణాలను ఒక్కొక్కటి విడమరిచి చెప్పి చంద్రబాబును మీడియా సాక్షిగా ఎండగట్టారు ఐవైఆర్ కృష్ణారావు.

మెల్లగా ఈ వ్యవహారంలో బ్రాహ్మణ సమాజాన్ని చంద్రబాబు అవమానించాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఐవైఆర్ కృష్ణారావును సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. ‘ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణ అధికారి ఐవైఆర్ కృష్ణారావును చంద్రబాబు సస్పెండ్ చేసి ఆ కులాన్ని అవమానించారని.. వైఎస్ హయాంలో ఎంతో మంది బ్రాహ్మణులు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, కార్పొరేషన్ పదవులు చేపట్టారని..కానీ బాబు ప్రభుత్వంలో ఉన్న ఒక్క బ్రాహ్మణ పదవిని ఊడగొట్టించి ఆ కులాన్ని అవమానించాడని’ మీడియా ముందు నాయకులు ధ్వజమెత్తారు.

బ్రాహ్మణ సామాజికవర్గంలో కూడా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నిధులను చంద్రబాబు చెప్పినట్టు టీడీపీ కార్యకర్తలకు పంచకుండా ఐవైఆర్ .. పేద బ్రాహ్మణులకు పంచాడని.. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఐవైఆర్ ను తొలగించారని మండిపడుతున్నారు. ముక్కుసూటిగా, పేదలకు న్యాయం చేయాలనుకునే సీన్సియర్ అధికారిని బాబు చెప్పిన మాట వినడం లేదని సస్పెండ్ చేయడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా మొత్తంగా ఐవైఆర్ సస్పెన్షన్.. బ్రాహ్మణ సమాజంపై దాడిగా ప్రతిపక్షాలు, కృష్ణారావు మార్చేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో వేచిచూడాల్సిందే..

 

To Top

Send this to a friend