అమ్మ బుజ్జి.. అలా కుదరదు


మెగా ఫ్యామిలీ నుండి విమర్శల మద్య హీరోయిన్‌గా పరిచయం అయిన నిహారిక మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో రెండవ సినిమాకు చాలా ఎక్కువ గ్యాప్‌ తీసుకుంది. రెండవ సినిమాను ఇటీవలే ప్రారంభించిన నిహారిక మొదటి సినిమా ఫలితం గురించి విభిన్నంగా స్పందించింది. మొదటి సినిమా ఫలితంను తాను ముందే ఊహించాను అని, అయితే కథ మరియు నా పాత్ర నచ్చడంతో సినిమాను కంటిన్యూ చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

విభిన్న తరహా కథతో పాటు, నా పాత్ర బాగుంటేనే నేను సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేస్తున్న రెండవ సినిమాలో కూడా మొదటి సినిమాలో ఎలాంటి పాత్రలో అయితే కనిపించానో, అలాంటి పాత్రలోనే కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దాంతో అప్పుడే రెండవ సినిమాపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులు సందేశాత్మక చిత్రాలు, ఆర్ట్‌ కథలతో తెరకెక్కే చిత్రాలను పెద్దగా ఆదరించరు. స్టార్స్‌ చేసినా కూడా కొన్ని సార్లు అలాంటి సినిమాలకు నిరాశ తప్పదు. అలాంటిది నిహారిక వంటి ఒక హీరోయిన్‌ ఆ సినిమాలు చేస్తే ఏమైనా ఉంది. పక్కా కమర్షియల్‌ సినిమాతో వస్తేనే నిహారికకు సక్సెస్‌ దక్కుతుంది. ఆ విషయాన్ని ఆమె గ్రహించకుంటే మరో రెండు మూడు సినిమాలు చేసి సర్దేసుకోవాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend