బట్టలే కరువయ్యాయా.?


మొన్న ప్రియాంక,నేడు చార్మి ఈ హీరోయిన్ల బుద్దులు మారడం లేదు. సినిమాల్లోనే కాదు.. బయట బరితెగిస్తున్నారు. గుడులు, గోపురాలకు సంప్రదాయ బద్దంగా పోవాల్సింది పోయి ఇష్టానుసారంగా పోతూ అపకీర్తి తెస్తున్నారు.

తెలుగు హీరోయిన్ చార్మి కూడా అదే బాటలో నడిచింది. ఇటీవల ఓ గురుద్వార్ కు చార్మి వెళ్లింది. అక్కడికి సంప్రదాయ బద్దంగా వెళ్లకుండా.. చిన్న గౌను వేసుకొని వెళ్లింది. అది చూస్తే కింద ఏం వేసుకోనట్టే ఉంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చ మొదలైంది. చార్మి గురుద్వార్ కు పోయినప్పుడు వేసుకున్న డ్రెస్ ను చూశాక ఆమెపై విమర్శల వాన కురుస్తోంది.

ఫాషన్ ట్రెండ్ అంటూ హీరోయిన్లు ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకుంటూ అతి చేస్తున్నారు. మొన్నటికి మొన్న హాలీవుడ్ లో హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బికినీలు వేసుకొని బీచ్ లలో జలకాలాడడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ప్రధానితో భేటిలో మోకాళ్ల కనిపించేలా పొట్టి డ్రెస్ వేసుకొని కాళ్లపైన కాలు వేసుకొని హోయలు ఒలికింది. ఇది వివాదాస్పదమైంది…ఇప్పుడు చార్మి కూడా అలానే వ్యవహరించి చిక్కుల్లో పడింది.

To Top

Send this to a friend