కేసీఆరే భయపడిపోతున్నారట.. అదేంటి.?

తెలంగాణను ఎంతో కష్టపడి సాధించిన ధీరుడతడు.. రాష్ట్ర ఏర్పాటు కోసం అవమానాలు భరించాడు. ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు చేధించాడు.. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టి చావు ముఖం చూసిన ధీరుడు ఆయన.. అలాంటి కేసీఆర్ ఒక చిన్న దానికి భయపడిపోవడం.. వాయిదా వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట.. అదంటే తనకు చచ్చేంత భయమని స్వయంగా కేసీఆర్ చెప్పుకొచ్చారు.. ఇంతకీ అందేటి అంటే..

కేసీఆర్ కంటిలో శుక్లాలు వచ్చాయి. దాన్ని లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా ఢిల్లీలో ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఆ ఆపరేషన్ కోసమే ఢిల్లీకి కేసీఆర్ తరుచుగా వెళ్తున్నారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ కోసం అంతా సిద్ధం చేశాకా ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తూ తప్పించుకుంటున్నారు.. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయించుకోమని ఎంత ఒత్తిడి చేసినా ఏదో సభ, సమావేశం అంటూ తప్పించుకొని హైదరాబాద్ వస్తున్నారట..

ఆపరేషన్ కోసం కత్తులు, ఇంజక్షన్ వాడడం తప్పనిసరి కావడంతో దానికి భయపడే కేసీఆర్.. ఆపరేషన్ వాయిదా వేస్తున్నారట..అయితే దీనిపై అసలు కారణం ఏంటని కేసీఆర్ను కొందరు ఎంపీలు అడిగితే.. కేసీఆర్ మెల్లగా ఆ విషయం రిలీవ్ చేశాడట.. ‘నాకు ఇంజక్షన్ అంటే చచ్చేంత భయం.. అసలు దాన్ని వేసుకోవడానికి హడలి పోతా.. అందుకే ఏ రోగమొచ్చినా మాత్రలతోనే నయం చేసుకుంటా.. ఈ విషయం మా కుటుంబ సభ్యులతో చెప్పకండని.. మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఆపరేషన్ చేయిస్తారు..’ అంటూ కేసీఆర్ ఎంపీలతో అనేసరికి అందరూ షాక్ అయ్యి నవ్వుకున్నారట… 60ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ధీశాలి కేసీఆర్ కు సూది మందు అంటే చచ్చేంత భయమనేసరికి ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend