ఇంతటి విశాలహృదయం వద్దబ్బా..

పాపం నిర్భయ.. బతికి ఉంటే ఏ మావోయిస్టుగానో.. లేక టెర్రరిస్టుగానో మారి తనపై అత్యాచారం చేసిన ఆ నలుగురిని చంపేసేదేమో.. ఎందుకంటే అంతటి భయంకర చావు ఆమెది.. ఆమెను బస్సులో రేప్ చేసి అ, మర్మాంగాలలో రాడ్లను జొప్పించి మరీ తమ లైంగిక వాంఛను క్రూరంగా తీర్చుకున్నారు ఆ ఐదుగురు నిందితులు.. దేశవ్యాప్తంగా దుమారం రేగిన ఈ సంఘటన జాతిని ఒక్కతాటిపైకి తెచ్చింది. కేంద్రం మెడలు వంచి నిర్భయ చట్టం వచ్చేలా చేసింది. ఆమె మరణంచినా ఆమె లాంటి ఎందరో అభాగ్యులకు ఇప్పుడా ఆ చట్టం రక్షణ కవచంలా ఉండి పోయింది…

మనదేశంలో చట్టాలు దోషులకు, కిరాతకులకు కూడా కొన్నేళ్లు బ్రతికే స్వేచ్చనిస్తాయి. మన దేశంపై దండెత్తి మన భారతీయు అమాయకులను పొట్టనపెట్టుకున్న కసబ్ లాంటి తీవ్రవాదులను బిర్యానీ పెట్టి మరీ పెంచి పోషించి చాలా ఏళ్లకు ఉరితీసిన సంస్కృతి మనది.న్యాయవ్యవస్థ జాప్యం కారణంగా నేరాలు తగ్గడం లేదు. ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చూస్తే దుబాయ్ చట్టాలే మేలనిపిస్తోంది. అక్కడ నడిరోడ్డు మీద శిరచ్చేదం చేస్తారు. కానీ ఇది భారత్.. వందమంది నేరస్థులు తప్పించుకోపోయినా.. ఒక్క నిర్ధోషికి శిక్ష ప కూడదనే విశాల భారత హృదయం మనది..

నిర్భయ కేసులో ఇన్నాళ్లకు దోషులకు మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో నిర్భయను క్రూరంగా రేప్ చేసి చంపిన ముకేష్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా గుర్తించి వీరికి ఉరిశిక్ష విధించాలని కోర్టు తీర్పునిచ్చింది. మరో నిందితుడు ఇప్పటికే తీహార్ జైల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ‘ఇలా ఇన్నేళ్లు ఆ నిందితులను బతకనీయడమే మన వ్యవస్థ చేసిన పెద్ద తప్పు.. వారిని ఆనాడే ఉరితీయాలని’ నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. ఆ మాటల్లో నిజముందనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend