దాసరిని ఇంతగా అవమానిస్తారా?

దర్శకేంద్రుడు దాసరి నారాయణ రావును మరణం ముందు వరకు అంతా కూడా గురువు గారు అంటూ గౌరవించేవారు. కాని చనిపోయిపో తర్వాత ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. కొందరు ఆయన చావును కూడా పబ్లిసిటీ కోసం వినియోగించుకుంటూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఇప్పుడు దాసరి మరణంకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ ఆయన మరణంకు ముఖ్య కారణం లైపో అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

దాసరి నారాయణ రావు పూర్తి ఆరోగ్యంగా ఉన్న సమయంలో లావు తగ్గేందుకు లైపో చికిత్స చేయించుకున్నారు. లావు ఎక్కువగా ఉండటం వల్ల గుండె పోటు సమస్యతో పాటు, పరిశ్రమలో మనుగడ కష్టంగా ఉందని దాసరి లైపో చేయించుకుని బక్కగా అవ్వాలని భావించారట. అందుకు అమెరికాలో 15 రోజుల పాటు చికిత్స కూడా చేయించుకున్నారు. అక్కడ నుండి ఆరోగ్యంగానే వచ్చారని, కొన్నాళ్ల తర్వాత లైపు చికిత్స వల్ల అనారోగ్య పరిస్థితులు ప్రారంభం అయ్యి చనిపోయాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

చనిపోయిన వ్యక్తి గురించి లాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం, దాసరి నారాయణ రావు లైపో చేయించుకున్నాడు అంటూ వారు చేస్తున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని, దాసరిని ఇంతగా అవమానిస్తారా అంటూ ఆయన సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాసరి నారాయణ రావు వయస్సు రీత్య అనారోగ్యం పాలయ్యారు తప్ప ఎలాంటి ఆపరేషన్‌ చేయించుకోలేదంటున్నారు. అయినా దాసరి ఏమైనా హీరోయినా లేక హీరోనా లైపో చేయించుకుని సన్నబడాలనుకోవడానికి అని ఆయన అభిమానులు కూడా అంటున్నారు.

To Top

Send this to a friend