ఒక్కడికోసం 16వేల కోట్లు మాయం..

ముంబై స్టాక్ ఎక్సేంజ్ శుక్రవారం ఉదయం కుప్పకూలింది. కేవలం గంట వ్యవధిలోనే ఇన్ఫోసిస్ క్యాపిటలైజేషన్ షేర్లు దాదాపు 16వేల కోట్లు ఆవిరైపోయాయి. ఈ సంస్థ ఈక్విటీ 7శాతానికి పైగా పతనం అయ్యింది. దాదాపు 2.10 లక్షల కోట్లుగా ఉన్న సంస్థ మార్కెట్ భారీగా పడిపోయింది. దీనంతటికి కారణం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ రాజీనామానే..

ఈరోజు ముంబై స్టాక్ ఎక్సేంజ్ ప్రారంభం కాగా ఇన్ఫోసిస్ కంపెనీ ఫైలింగ్ లో సిక్కా రాజీనామా చేశాడని.. దాన్ని ఆమోదిస్తున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ కి ఫైల్ పంపింది. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇన్ఫోసిస్ షేర్లన్నీ కుప్పకూలిపోయాయి. దాదాపు 16వేల కోట్లు గంటలో కరిగిపోవడంతో ఇన్ఫోసిస్ కుదేలయ్యింది. కాగా ఎంతో మల్టీ టాలెంటెడ్ అయిన విశాల్ సిక్కా ఎందుకు రాజీనామా చేశాడన్నది మాత్రం కంపెనీ వర్గాలు కానీ, ఆయన కానీ వెల్లడించకపోవడం గమనార్హం.

విశాల్ సిక్కా.. పేరు వినే ఉంటారు.. ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు. నారాయణ మూర్తితో కలిసి అప్పుడెప్పుడో 1996లో భారతదేశంలో ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీని ఈయన స్థాపించాడు. అప్పటి నుంచి విశాల్ సిక్కా సీఈవోగా.. నారాయణ మూర్తి చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు ఈ కంపెనీని ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా చేశారు..

To Top

Send this to a friend