ఇంద్రజపై పవన్‌ గాలి.. ఇక ఆమె అందదేమో!

Actress Indraja Photos @ Shatamanam Bhavati Audio Release

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అత్త పాత్రలో నదియా నటించిన విషయం తెల్సిందే. అంతకు ముందు ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించినా కూడా అత్తారింటికి దారేది చిత్రం తర్వాతే నదియాకు తెలుగులో మంచి క్రేజ్‌ వచ్చింది. తెలుగులో ప్రస్తుతం నదియాకు హీరోయిన్‌కు ఉన్నంత స్థాయి ఉంది. భారీ పారితోషికం ఇచ్చి మరీ నదియాను అత్త లేదా అమ్మ పాత్రలకు బుక్‌ చేస్తున్నారు. అదంత కూడా పవన్‌ దయ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

నదియా తర్వాత పవన్‌ గాలి నిన్నటి తరం హీరోయిన్‌ ఇంద్రజపై పడబోతుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఇంద్రజ గత కొంత కాలంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమెకు మంచి గుర్తింపు రాలేదు. ఇటీవల ఈమె నటించిన శతమానంభవతి చిత్రం సూపర్‌ హిట్‌ అయినా కూడా ఇంద్రజకు మాత్రం ప్రత్యేకంగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు పవన్‌ సినిమాలో ఛాన్స్‌ దక్కిన తర్వాత ఆమె ఫుల్‌ హ్యాపీగా ఉంది.

త్రివిక్రమ్‌ తాజాగా ఇంద్రజను కలిసి కథ వివరించాడని, చిన్న పాత్ర అయినా కూడా తప్పకుండా మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో వెంటనే ఇంద్రజ ఆ సినిమాకు కమిట్‌ అయ్యింది అంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించారు.

To Top

Send this to a friend