పాక్ పై ఓటమితో భారత్ క్రికెట్ టీంలో విభేదాలు.

బాగా ఆడితే ఏం పర్లేదు.. ఓడారా అన్ని వైపులా విమర్శలు.. ఇప్పుడు టీమిండియాపై విమర్శల వాన పడుతోంది. క్రికెటర్లను నెత్తిన పెట్టుకున్న క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఏకీపారేస్తున్నారు. పాకిస్తాన్ పై ఓటమెరగని భారత్ ఫైనల్లో ఓడగానే జీర్నించుకోలేకపోతున్నారు. తాజాగా భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ కూడా టీంలో లుకలుకలున్నాయని తెలిసిపోయింది. హార్దిక్ ఒక్కడే పాకిస్తాన్ పై ఫైనల్లో వీరోచితంగా పోరాడాడు.. 75 పరుగులకుపైగా చేసి దుమ్ముదులుపుతుండగా రనౌట్ అయ్యాడు. దీనికి కారణం రవీంద్రజడేజానే అని ట్విట్టర్ లో విమర్శించడం దుమారం రేపుతోంది. ఇప్పటికే కుంబ్లేతో పడక కోహ్లీ సతమతమవుతుండగా.. ఇప్పుడు హార్దిక్ చేసిన ట్వీట్ తో కోహ్లీ టీంలో లుకలుకలున్నాయని తేలిపోయింది.

అంతకుముందు బాగా ఆడిన టీమిండియా ఫైనల్ లో పాకిస్తాన్ ముందు తేలిపోయింది. దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న ఇండియా- పాకిస్తాన్ లు.. క్రికెట్ లో ఇండియా ఓడిపోవడంతో అంతటా ఉద్రేకాలు పెరిగిపోయాయి. విరాట్ కోహ్లీ తప్పులపై విమర్శలు, క్రికెటర్లపై ఆడిపోసుకోవడాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే హార్దిక్ పాండ్య చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది..

రవీంద్రజడేజా కావాలనే తనను రనౌట్ చేశాడని.. హార్దిక్ పాండ్యా ట్విట్టర్ పెట్టడం దుమారం రేగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ ట్వీట్ ను హార్దిక్ తీసేసి గొడవను సద్దుమణిగేలా చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హార్దిక్ ట్వీట్ చాలా మంది రీట్వీట్ లు, కామెంట్లు చేసేశారు.. టీమిండియాలో లుకలుకలకు ఉన్నాయని టీం యూనిట్ గా లేదని హార్దిక్ ట్వీట్ తో తేటతెల్లమైంది..

To Top

Send this to a friend