బర్లా.. బార్డర్ లో కాదు.. మైదానంలో తేల్చుకుందాం..

నరాలు తెగుతున్నాయి. ఉత్కంఠ ఊపేస్తోంది. శత్రుదేశం కాచుకూర్చుంది. సరిహద్దుల్లో భారత సైనికుల తలలు నరికిన పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం వైమానిక దాడులతో బెంబేలెత్తించింది. ఆ యుద్ధం దేశసరిహద్దుల్లో సాగితే.. ఇప్పుడు యుద్ధం మైదానంలో జరుగుతోంది.

భారత్, పాకిస్తాన్.. రెండు వేటికవే శత్రుదేశాలు.. ఈ రెండింటి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతూనే ఉంటోంది. సరిహద్దుల్లో వందలమంది సైనికులు చనిపోతూనే ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద భూతంతో ఇప్పటికీ భారత్ పై పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్నాయి. అందుకే ఆ దేశంతో క్రికెట్ సంబంధాలను భారత్ తెంచుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ టోర్నమెంటులో తప్పితే భారత్ పాక్ లు బయట క్రికెట్ ఆడడం లేదు..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ్యూహాత్మకంగా ఈ వైరి దేశాల మధ్య మ్యాచ్ జరిగేలా ప్లాన్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్ షిప్ ఉండే భారత్ పాక్ క్రికెట్ అంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలందరూ చూస్తారు. కోట్ల రూపాయల యాడ్స్ వస్తాయి. ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాక్ మ్యాచ్ ఒక్కటి జరిగితే చాలు లాభాలే లాభాలు.. అందుకే మొదటి మ్యాచ్ లోనే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ను పెట్టి ప్రపంచ క్రీడాభిమానులకు పండుగలాంటి మ్యాచ్ ను ఐసీసీ ప్లాన్ చేసింది..

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇంగ్లాండ్ లోని బర్నింగ్ హామ్ వేదికగా జరగబోయే భారత్ పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం.. భారత్ పాక్ మ్యాచ్ ఉండడంతో జనం టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ క్రికెట్ లోనే దిగ్గజ బ్యాట్స్ మెన్ భారత్ కు ఉన్నారు. విరాట్, ధోని, యువరాజ్, ధావన్, రహానే సహా మేటి క్రికెటర్ల బ్యాటింగ్ కు.. బలమైన పాక్ బౌలింగ్ కు మధ్య ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపడం ఖాయం. సో అందరూ ఈ మైదానంలో జరిగే భారత్ పాక్ మ్యాచ్ కు రెడీ గా ఉండంది..

To Top

Send this to a friend