దేశ భక్తులు నోరు విప్పరేం !

పెద్దనోట్ల రద్దు.. భారతదేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేసిన ఆర్థిక విపత్తు. ప్రధాని నరేంద్రమోడీ రాత్రి వేళ ప్రకటించిన ఈ నిర్ణయంతో అప్పటివరకు 8శాతానికి పైగా వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్త జీడీపీ ఇప్పుడు 6.0కి పడిపోయింది. కానీ నల్లధనం అరికట్టడానికే అని బీజేపీ, మోడీ బృందం బీరాలు పలికింది. వచ్చిన నల్లధనాన్ని పేదల జన్ ధన్ ఖాతాల్లో వేస్తామని చెప్పాడు ఆ బీజేపీ పెద్దమనిషి. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తానని ఘీంకరించాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

‘ పెద్ద నోట్ల రద్దు వలన ప్రయోజనం వుండదు, బ్లాక్‌ మనీ బయటపడదు’ అని చెప్పిన వారిని ‘దేశద్రోహులు’గా, నల్ల ధనం కలవారిని సమర్ధించేవారిగా చిత్రించారు. కరెన్సీ కోసం రోజుల తరబడి పనులు, వేతనాలు నష్టపోయి క్యూలలో నిలబడటాన్ని ‘దేశభక్తి ‘గా పేర్కొన్నారు. త్వరలో నరేంద్రమోడీ భక్తులు నోట్ల రద్దు వార్షిక విజయోత్సవాలకు సిద్ధం అవుతుండగా విధిలేని పరిస్ధితుల్లో రిజర్వుబ్యాంకు వివరాలు ప్రకటించాల్సి వచ్చింది.ఒక శాతం నోట్లు మాత్రమే బ్యాంకులకు తిరిగి రాలేదని పేర్కొన్నది.

ఇప్పటికైనా అసలు ఈ నోట్ల రద్దు నిర్ణయం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో, దీని వలన జనానికి, దేశ ఆర్ధిక వ్యవస్ధకు జరిగిన సష్టం ఎంతో దేశభక్తులు చెప్పాలి. మా పక్కింటి దేశభక్తుడొకరిని నేను నిలదీస్తే, నరేంద్రమోడీ మీది మోజు, నమ్మకంతో నిజమే కాబోలు అనుకున్నాను ఇప్పుడు కాదనుకుంటున్నాను అంటూ నసిగాడు. ఇది విన్న తరువాత ‘‘వూరంతా కావమ్మ మొగుడిలా వున్నాడంటే కావచ్చుననుకొని కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారిన బోతా అన్న దొంగ సన్యాసి కథ’’ గుర్తుకు వచ్చింది. అంటూ నిట్టూర్చాం..

To Top

Send this to a friend