సరిహద్దుల్లో తలపడ్డ భారత్ చైనా..

 

భారత్ -చైనా దేశాల సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. భారత్ లోని సిక్కిం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం డోకాలాలో వద్ద నిన్న చైనా, భారత బలగాలు వాగ్వాదాలు, తోపులాటలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చైనా సైనికులు సిక్కిం సరిహద్దుల్లోని భూటాన్, టిబెట్ సరిహద్దుల్లో రోడ్డును నిర్మిస్తున్నాయి. దీనిపై భారత్, భూటాన్ దేశాలు నిరసన తెలుపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చైనా సైనికులను నిన్న భారత సైనికులు అడ్డుకొని నిలువరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది మన సైన్యం చెబుతున్న వాదన.. చైనా మాత్రం భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తున్నారు. అందుకే తాము భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపివేశామని చెబుతున్నారు . ప్రస్తుతం సిక్కిం శివారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగుడి కారిడార్ కు 5 కి.మీల దూరంలో చైనా, భారత్ బలగాలు కాపుకాసి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉన్నాయి.

చైనా, భారత్ బలగాల ఘర్షణకు సంబంధించిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend