ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ లూప్ హోల్ ను ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంలోని ఆదాయపన్ను విభాగానికి సేవా పన్నును ఎగొట్టాడు. ఈ విషయాన్ని కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ నిగ్గు తేల్చింది. కేంద్ర ఇన్ కం ట్యాక్స్ కు దాదాపు రూ.1.10 కోట్లు ఎగొట్టాడని కాగ్ సంస్థ ఆక్షేపించింది. విదేశాల్లో సినిమా షూటింగ్ లో పాల్గొనన్నానని ఎన్టీఆర్ తన పారితోషికంగా వచ్చిన సొమ్ములోంచి వినోదపు సేవ పన్ను కట్టలేదని.. ఈ జరిగిన అవకతవకలపై కేంద్ర ఆర్థిక శాఖ కూడా పట్టించుకోలేదని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది.

దీంతో అలెర్ట్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ శుక్రవారం పార్లమెంటులో దీనిపై సమాధానమిచ్చారు. కాగ్ నివేదక ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసులు ఇస్తామని .. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..

అప్పట్లో కరుణ్ జోహార్ దర్శక నిర్మాతగా హిందీలో ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే హిందీ సినిమాను మొత్తం న్యూయార్క్ లోనే చిత్రీకరించారు. సినిమాలు ఇండియాలో తీస్తే వ్యయంలో 10శాతం కేంద్రానికి పన్ను కట్టాలి. కానీ విదేశాల్లో షూటింగ్ తీశామని.. అందుకుని ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి ఆ సినిమా హీరో రణబీర్ కపూర్ రూ.83.43 లక్షల పన్నును కేంద్ర ఇన్ కం ట్యాక్స్ కు ఎగొట్టాడు. లెక్కల్లో ఈ బొక్కను చూపించి తప్పించుకున్నాడు. సేమ్ అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ఎన్టీఆర్ మొత్తం విదేశాల్లోనే తెరకెక్కించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 6 నెలల పాటు లండన్, స్వీడన్ లో ఉన్నారు.

అప్పుడే 2015లో లండన్ కు చెందిన వైబ్రంట్ లిమిటెడ్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఎన్టీఆర్ కు సినిమాలో నటించినందుకు గాను పారితోషికంగా రూ.7.33 కోట్లు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ దీన్ని ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి తాను చెల్లించాల్సిన పన్ను రూ.1.10 కోట్లను ఇన్ కంట్యాక్స్ కు కట్టలేదు. ఇన్ కం ట్యాక్స్ లోని ఈ బొక్కను ఆధారంగా తీసుకొని హీరోలు విదేశాల్లో సినిమాలు తీసి ఎగ్గొడుతున్నారని.. వారందరిపై చర్యలు తీసుకోవాలని కాగ్ ఆక్షేపించడంతో ఎన్టీఆర్ చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.

To Top

Send this to a friend