కేసీఆర్ ఒప్పుకుంటాడా..?


ఎంపీగా ఉంటే ఏం లాభం అన్న మీమాంస ఎంపీ కవితలో మొదలైనట్టు సమాచారం. ఈ మధ్య తన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటనకు వచ్చి పేద పిల్లలకు, గ్రామస్థులకు బాహుబలి షో వేసి చూపించిన కవితకు అక్కడో చిక్కు ప్రశ్న ఎదురైందట.. ఎప్పుడు ఎంపీగా ఢిల్లీ లో ఉండే మీరు ఎమ్మెల్యేగా ఉంటే మా పనులు ఇంకా త్వరగా అవుతాయని గ్రామస్థులు సూచించారట.. దీంతో కవితలో అంతర్మథనం మొదలైందట…

ఎంపీగా ఢిల్లీ వీధుల్లో ఉంటే ప్రజలతో సాన్నిహిత్యం ఉండదని కవిత చెబుతున్నారు. ఒక లీడర్ గా సమాజంలో గుర్తింపు పొందాలంటే రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేగా గెలుస్తేనే పేరు, ప్రఖ్యాతలు వస్తాయని స్థానిక నాయకులతో అన్నారట.. బీజేపీ కేంద్రంలో ఉండగా.. ఎట్టిపరిస్థితుల్లో టీఆర్ఎస్ అందులో చేరే అవకాశం లేదు. దీంతో కవితకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే వచ్చే 2019 ఎన్నికల్లో తాను ఎంపీ గా కాకుండా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని కవిత అన్నదట.. సో కవిత రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెడుతుండడం రాజకీయంగా ఓ సంచలనంగా మారింది..

ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కేసీఆర్, కేటీఆర్ లు రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు సీఎంగా, మంత్రిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు కవిత కూడా వస్తే అసెంబ్లీలో ముగ్గురు అవుతారు. అదీ ప్రతిపక్షాలకు, మీడియాకు కేసీఆర్ ఫ్యామిలీ సమాధానం చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కవిత నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్, కేటీఆర్ ఒప్పుకునే అవకాశాలు లేవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

To Top

Send this to a friend