భర్తను కాదని.. మామతో వెళ్లి..

అక్రమ వ్యవహారాలు ఆ ఇద్దరిని పక్కదారి పట్టించాయి. చివరకు పారిపోయేలా చేశాయి. వారి మరణానికి కారణమయ్యాయి. ఖమ్మం జిల్లా లోని మంచుకొండ బస్టాండ్ వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి బ్లేడ్ తో మణికట్టు కోసుకొని ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ అనిత(23) మృతిచెందగా.. వీరన్న అనే వ్యక్తి మాత్రం బతికి బట్టకట్టాడు. వీరి గురించి ఆరాతీయగా పోలీసులకు ఓ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.

ఓ మహిళ చేసిన తప్పు తనతో పాటు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వివాహేతర సంబంధం చివరకు ప్రాణాలే బలితీసుకునేలా చేశాయి. సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన ఖమ్మం జిల్లా రగునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధం పెట్టుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన బాణోత్ వీరన్న కుమారుడికి మహబూబాబాద్ కు చెందిన అనిత(23)కు వివాహం జరిగింది. రెండేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో మామవీరన్న చిచ్చు రేపాడు. కుమారుడికి తెలియకుండా కోడలిపై కన్నేసి లోబరుచుకున్నాడు. వీరి అక్రమ సంబంధం రెండేళ్లు సాగింది. చివరకు కొడుకుకు తెలియడంతో వీరన్న కోదాడకు పారిపోయాడు. అనితను పుట్టింటికి పంపించారు.
అయితే వీరన్న కోడలు కు ఫోన్ చేసి తనతో వచ్చేయాలని కలిసి జీవిస్తామని తెలిపాడు. ఇక్కడ కోడలు అనిత పొరపాటు చేసింది. మామ దగ్గరికి వెళ్లి అతడితో 40రోజులు గడిచాక డబ్బులన్నీ అయిపోవడంతో ఇద్దరిలో సంశయం నెలకొంది. ఇంటికెళ్లి పోదామని వీరన్న తెలపగా అనిత ఒప్పుకోలేదు. ఇంటికి వెళితే తనను క్షమించరని భావించి ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యారు..మంచుకొండ బస్టాండ్ కు వచ్చి క్రిమిసంహారక మందుతాగి బ్లేడ్ తో వీరన్న, అనిత చేయి కోసుకున్నారు. ఈ ఘటనలో అనిత మృతిచెందగా.. వీరన్న చావు బతుకుల మధ్య ఉన్నాడు. అక్రమ సంబంధాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ..

To Top

Send this to a friend