ఇలియాన న్యూడ్‌ షో

 

తెలుగులో ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఇలియాన తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్‌గా ఇలియాన రికార్డును సృష్టించింది. అలాంటి ఇలియాన బాలీవుడ్‌కు ‘బర్ఫీ’ చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ సినిమా సక్సెస్‌ అవ్వడంతో పాటు ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది.

బాలీవుడ్‌లో దాదపు మూడు నాలుగు సంవత్సరాల పాటు వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే గత కొంత కాలంగా సినిమాల్లో నటించే ఛాన్స్‌లు రాక మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. తాజాగా అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా తెరకెక్కిన ‘బాద్‌షాహో’ చిత్రంలో శృతిహాసన్ ని హీరోయిన్‌గా అనుకోవడం, ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో అనుకోని అవకాశంగా బాద్‌షాహోలో నటించే ఛాన్స్‌ వచ్చింది. వచ్చిన అవకాశంను వదులుకోవద్దని భావించిన ఇలియాన ఆ చిత్రంలో ఫుల్‌గా అందాల ప్రదర్శన  చేసినట్లుగా తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లోనే ఇలియాన రెచ్చి పోయి మరీ అందాల ప్రదర్శణ చేసింది. ఇక ఒక సీన్‌లో ఏకంగా టాప్‌లెస్‌గా నటించి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఇలియాన గ్లామర్‌ పాత్రలు చేసింది, కాని ఇలా టాప్‌లెస్‌గా మాత్రం నటించింది లేదు. అవకాశాలు రాకపోవడంతో పాటు, వచ్చిన ఈ అవకాశంతో తను ఎలా అయినా నటించేందుకు సిద్దం అని అందరికి చెప్పేందుకు ఇలా టాప్‌లెస్‌గా కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇలీబ్యూటీ బరితెగింపుతో మళ్లీ బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

To Top

Send this to a friend