ఐఫా వద్దంది.. జాతీయ ఉత్తమ చిత్రం!


మొన్నటి ఐఫా చిత్రోత్సవం.. జనతా గ్యారేజ్ కు ఎక్కువ అవార్డు వచ్చాయి. దీనిపై ‘పెళ్లి చూపులు’డైరెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెళ్లి చూపులు సినిమాను చూడకుండా.. కనీసం నామినేట్ చేయకుండా ఐఫా వల్ల ఏకపక్షంగా అవార్డులు ఇచ్చారని మండిపడ్డారు. ఆయన అంసతృప్తిలో నిజముందని రుజువైంది.

64వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఇందులో ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కడం విశేషం.. ఐఫా అవార్డుల్లో మొత్తం జనతా గ్యారేజ్ జపం చేసినా కూడా జాతీయ స్థాయిలో మాత్రం పెళ్లి చూపులు చిత్రం సత్తా చాటడం విశేషం.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి పెళ్లి చూపులు సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని చాలా నేచురల్ గా తెరకెక్కించారు. భారీ డైలాగులు, ఫైట్లు లేకుండా ఇంట్లో ఎలా ఉంటుందో అలా సరదా కామెడీ తెరకెక్కించారు. దీంతో తెలుగు, దక్షిణాదిన పెళ్లి చూపులకు ప్రాధాన్యం దక్కకున్నా జాతీయ స్థాయిలో మాత్రం సత్తా చాటింది.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లి చూపులు’ నిలిచింది. ఉత్తమ సంభాషణలకు పెళ్లి చూపులు మాటల రచయిత, దర్శకుడు తరుణ్ భాస్కర్ అవార్డు గెలుచుకోవడం విశేషం..

జాతీయ ఉత్తమ నటుడు -అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ హిందీ చిత్రం -నీర్జా
ఉత్తమ సంగీత దర్శకుడు -బాపు పద్మనాభ (కన్నడ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం -శతమానం భవతి
ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)

To Top

Send this to a friend