రాష్ట్రానికి కరెంట్ బంద్ చేస్తే బొగ్గు నిలిపివేస్తా: తెలంగాణ ఎస్పీడీఎల్ సీఎండీ

కరెంట్ లొల్లి ముదిరిపాకాన పడింది. ప్రస్తుతం తెలంగాణలో కరెంట్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఉంది. అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి ఇండస్ట్రీ సింగరేణి ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గే దక్షిణ భారతదేశవ్యాప్తంగా కరెంట్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో సరిపడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేవు.. దీంతో తెలంగాణ బొగ్గు విస్తారంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాలు లేక ఏపీ నుంచి పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ కొంటోంది.

ఏపీని పాలించిన ఆంధ్రా నాయకులందరూ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారు. మండలాలను కలిపేసుకొని ఖమ్మంలోని సింగూర్ జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ లాక్కుంది. దాంతో పాటు విజయవాడ, నెల్లూరులలో విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటికి బొగ్గును సింగరేణి నుంచే సరఫరా చేస్తున్నారు. అక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును తెలంగాణకు సరఫరా చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే చిక్కు వచ్చిపడింది. ఇటీవల ఏపీ విద్యుత్ కేంద్రాలు తమ బకాయిలు తీర్చాలని .. లేకపోతే తెలంగాణకు విద్యుత్ ను నిలిపివేస్తామని హెచ్చరించాయి. తెలంగాణ దీనికి కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలోని సింగరేణి నుంచి లక్షల టన్నుల బొగ్గు ను ఏపీ విద్యుత్ కేంద్రాలకు తరలించామని.. దానికి గాను ఏపీ విద్యుత్ కేంద్రాలే తమకు 3వేల కోట్లు డబ్బులు బకాయి ఉన్నదని కౌంటర్ ఇచ్చింది. దీంతో విద్యుత్ సమస్య ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య లొల్లికి కారణమైంది.

‘మేం బొగ్గు ఇస్తున్నాం.. మీరు కరెంటు ఇస్తున్నారు’ అంతే అని తెలంగాణ.. లేదు లేదు.. మా కరెంట్ కు మీరు డబ్బులివ్వాల్సిందేనని ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పట్టుబట్టాయి. ఈ వివాదం ముదురుతుండగానే తెలంగాణ ఎస్పీడీఎల్ సీఎండీ రఘురామరెడ్డి .. ఏపీ తమ రాష్ట్రానికి కరెంట్ బంద్ చేస్తే బొగ్గు సరఫరా నిలిపివేస్తామని… తాము చత్తీస్ ఘడ్ నుంచి కరెంట్ కొంటామని హెచ్చరించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది.

ఏపీలోని విద్యుత్ కేంద్రాలు నడవాలంటే బొగ్గు కావాల్సిందే. ఆ బొగ్గు తెలంగాణ వద్ద ఉంది. ఏపీకి అందులో వాటా లేదు. అందుకే ‘ఏపీ పునర్విభజనలో తమకు అన్యాయం చేశారని.. సింగరేణిలో మాకూ వాటా ఉందని.. ఉమ్మడి ప్రభుత్వం సింగరేణి 886 కోట్ల నిధులు వెచ్చించదని.. సింగరేణిలో తమకూ సగం వాటా కల్పించాలని’ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం తాజాగా లేఖ రాయడం సంచలనంగా మారింది.

అసలే కేసీఆర్.. మా నీళ్లు, ఉద్యోగాలు, నిధులంటూ ఫైట్ చేసే మనిషి.. ఆయన సీఎంగా ఉండగా సింగరేణిలో వాటా కావాలని ఏపీ సీఎం కోరడంతో ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల్లో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. దీనిపై తెలంగాణ ఏం కౌంటర్ ఇస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend