జాతీయ జెండాను అగౌరవిస్తే జైలుకే..

శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. పాతతరానికి భారత జాతీయ పతాకాన్ని గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు గానీ, నేటి తరానికి మాత్రం దాని విశిష్టతను చాటిచెప్పాల్సిందే. ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే, స్టేడియంలోని యువతే కాదు, చివరికి పెద్దలు కూడా త్రివర్ణ పతాకాన్ని ఇష్టానుసారం ఎగురవేసి తమ అభిమాన జట్టుపై ప్రేమను కురిపించే వారు తమ ఇష్టానుసారం అలా జాతీయ పతాకాన్ని వినియోగంచరాదని మరచిపోతుంటారు. జాతీయ పతాకం వినియోగంలో గతంలో ఉన్నంత కఠిన నిబంధనలు ప్రస్తుతానికైతే లేనప్పటికీ ఉన్న వెసులుబాటును కూడా దుర్వినియోగం చేయరాదన్నదీ మనం తెలుసుకోవాల్సిన అంశం.

భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం.

*మన జాతీయ జెండాను గౌరవిద్దాం*
జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారం
జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం
పౌరుల ప్రాధమిక విధి, ఈ దేశం మనది/మనందరిది కాబట్టి, ఆవిధులలో
*జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి.
*జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి*.
*1)* 6300×4200 మిల్లీమీటర్లు.
*2)* 3600×2400 మిల్లీమీటర్లు.
*3)* 2700×1800 మిల్లీమీటర్లు.
*4)* 1800×1200 మిల్లీమీటర్లు.
*5)* 1350×900 మిల్లీమీటర్లు.
*6)* 900×600 మిల్లీమీటర్లు.
*7)* 450×300 మిల్లీమీటర్లు.
*8)* 225×150 మిల్లీమీటర్లు.
*9)* 150×100 మిల్లీమీటర్లు.
ఇందులో చాలా *పెద్ద సైజు* 6300×4200 మిల్లీమీటర్లు.*చిన్న సైజు* 150×100 మిల్లీమీటర్లు.

*పతాకంలోని కాషాయపు రంగు పై భాగాన ఉండేటట్లు జెండాను కట్లాలి.
*పతాక వందనానికి హాజరైన పౌరులందరు ప్రజలందరు జెండాకు ఎదురుగా సావధానులై నిశ్శబ్ధంగా
నిలబడి వందనం చేయాలి.
* జెండా పైకి ఎగురవేసేటప్పుడు వడివడిగా ఎగరవేయాలి. పతాకం ఎగురగానే పౌరులందరూ
ముక్తకంఠంతో సంయుక్తంగా జాతీయగీతాన్ని ఆలపించాలి.
*ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప *సాధారణంగా సూర్యడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు
అస్తమించే వరకు జెండా ఎగురతుండాలి*. అలాగే దించేటప్పుడు మెల్లమెల్లగా నిదానముగా
క్రిందకుదించాలి.
*ఇతర దేశాల జెండాలతో మరియు *ఏదైనా జెండాలతో కలిసి మన జాతీయ జెండాను ప్రదర్శించాల్సివస్తే*
*అన్నింటి కంటే కుడిభాగన ఉండాలి*.
*ఊరేగింపుగా వెళ్లుతున్నప్పుడు ముందు భాగానికి కుడివైపుగా జెండా ఉండాలి.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద* అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి
సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు,
జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు…మెదలైన *ప్రభుత్వ భవనాలపై*
*ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి*.
*2002 జనవరి 26 నుండి* ఈ క్రింది నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ నియమ నిబంధనావళి
ప్రకారం *ప్రజలు*, *ప్రవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జాతీయ పతాకాన్ని* *సంవత్సరం పొడవునా స్వేచ్చగా*
*ఎగురవేయవచ్చు.*
*దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనా
మృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలుపడానికి సగానికి దించాలి. అవనతం చేయాలి.
ఇది ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే.

*జాతీయ పతాకం పట్ల చేయకూడనవి…
*1.* సూర్యోదయం కంటే ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు.
*2.*జాతీయ పతాకం ఎట్టి పరిస్థితులలో నేలను తారరాదు, తగలకూడదు. అలాగే తలక్రిందులుగా (ఆకుపచ్చ రంగుపైకి) ఎగురనీయరాదు.
*3.*జాతీయ పతాకాన్ని అలంకరణంగా గాని, తోరణాలుగా గాని, దుస్తులుగా గాని కుట్టించుకోకూడదు.
వంటి పై ధరించే వస్త్రాలుగా గాని, జాతీయ పతాకం పై ఎలాంటి వ్రాతలు వ్రాయరాదు. దీనిని సంచిలా
వాడుకొనరాదు. అలగే ఏదైనా సమావేశాల వేదికపై కప్పరాదు. ఏదైనా కంపెని వాణిజ్య పరమైన
లాభాల కోసం జాతీయ పతాకాన్ని వాడరాదు.
*4.పెను తుఫాన్ లున్న సందద్భంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయరాదు.
*5.*జాతీయ జెండా ఉపయోగానికి పనికి రాకుండా పోతే క్వాషీ జ్యుడిషియల్ అధికారికి తెలిపి వారి
అనుమతి పొంది జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను విడదీయాలి. వారి పరిశీలనకు
అప్పగించాలి.
*6.*జాతీయ పతాకానికి కుడివైపున గాని, ఎత్తుగా మరే జెంగా గాని మరే జాతీయ చిహ్నాం కాని
ఎగురడానికి వీలులేదు.
*7.*ప్టాస్టిక్ జెండాలను వాడరాదు. ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో కరగదు. కాబట్టి ప్లాస్టిక్ తో రూపోందించిన
జెండాలను వినియోగిస్తే అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి జాతి గౌరవానికి భంగం కలిగే ప్రమాదం
ఉంది.
*8.*జెండాలను ఉత్సవం ముగిసిన వెంటనే తీసివేయాలి. వారలు, నెలలు తరబడి తోలగించనట్లయితే
వాతావరణ మార్పులు, ఇతర కారణాల వల్ల అవి చిరిగి, ముక్కలై నేలపై పడిపోతాయి. భవనాలు,
స్థంభాలు, కిటీకీలకు అవి అలాగే వేలాడే ప్రమాదముంది.
*9.*ఉత్సవాల తరువాత కాగితపు జెండాలను నేలపై వదిలివేయకూడదు. పారేయకూడదు.
సాధ్యమైనంత వరకు జాతీయ పతాక గౌరవానికి ఎటువంటి భంగం కలుగని ప్రత్యేక ప్రదేశాలలో వాటిని
ఉంచాలి.
*10.*జాతీయ పతాకాన్ని అలంకరణ కోసం తోరణంగా, గుండ్రటి బ్యాడ్జిగా, అలంకార వస్తువుగాని, మరే
విధంగా గాను వినియోగించరాదు.
*11.*విద్యార్థులలో జాతీయ భావాలను, జాతీయ పతాకం పై గౌరవాన్ని పెంపోందించే కార్యక్రమాలను
విద్యాసంస్థలలో చేపట్లేలా పాఠశాల విద్యా సంచాలకులు చర్యలు తీసుకోవాలి.
*12.*జాతీయ పతాకం ఎగుర వేసే ప్రాంతాలలో ఆదేశాలు , నియమాలు పాటిస్తూన్నారో లేదో ఆధికారులు
పరిశీలించాలి. ఎవ్వరైనా నియమావళిని అతిక్రమిస్తే అవసరమైన చర్యలు తీసుకోవాలి.
*13.*జాతీయ జెండాను అవమానపరిచే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లేదా జరిమానా
లేదా రెండింటితో కూడిన శిక్షలు వేయవచ్చు. *మరిన్ని విరరాలకు జాతీయ గౌరవ చిహ్నాల పరిరక్షణ
(అవమాన నిరోధక) చట్టం-1971లోని నిబంధనలను ఓపిక చేసుకోని చదవాల్సిందే.*

*ముఖ్యంగా కార్ల మీద :-రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాని, కేంద్రకేబినేట్ మంత్రులు గవర్నర్లు, విదేశాలలోని భారత రాయబారులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు…. తమ కార్ల మీద జాతీయ పతాకాన్ని ఉంచుకొనవచ్చును*

To Top

Send this to a friend