వస్తే.. చంద్రబాబు జైలుకేనట..

అధికారం ఎవరి చేతిలో ఉంటే వారి ప్రత్యర్థులు జైలుకు వెళ్లాల్సిందేనా.. చట్టం.. ఏలికల చుట్టమా..? ఇప్పుడు అలానే ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా .. మోడీని, అమిత్ షాను, బీజేపీ నేతలను సీబీఐని ప్రయోగించి వివిధ కేసుల్లో ఇరికించింది. ఇప్పుడు మోడీ కూడా అదే చేస్తున్నాడు. సీబీఐని ఉపయోగించుకుంటున్నాడు. తమిళనాడులో శశికళను జైలు పంపాడు. బీహార్ లో తనకు కొరకరాని కొయ్యాగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ను జైలుకు పంపేందుకు రెడీగా ఉన్నాడు. ఇలా ఇప్పుడు చట్టం.. తమ వారిని ఒకలా ప్రతిపక్షాలను ఒకలా చూస్తోంది..

ఏపీలో కూడా ఇదే రాజకీయం కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చనిపోయాక అధికారం కోసం జగన్ తిరుగుబావుట ఎగురవేయడం ఆయన్ను కష్టాల్లోకి నెట్టింది. వైసీపీని మొదలుపెట్టి అధికార కాంగ్రెస్ ను ఎదురించడంతో ఆయనపై కేసులు పెట్టించి జైలు పాలు చేశారు. ఇప్పటికీ ఆ కేసులు వెంటాడుతున్నాయి.

జగన్ ఇప్పుడు ప్లీనరీ వేదికగా చేసిన ప్రకటన కూడా అలానే ఉంది. అధికారంలోకి రాగానే ఎవరైతే తమను వేధించారో.. ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై కేసులు పెట్టి లోపలేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి అక్రమాలను బయటపెడతామని జగన్ శపథం చేశారు. ఎన్సీఏఈఆర్ఓ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఏపీని అవినీతిలో నంబర్ స్టేట్ గా ధ్రువీకరించిందని కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబును అవినీతిని ధ్రువీకరించిందని జగన్ మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగే చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమన్నారు. ఇలా ఎవరు అధికారంలోకి వస్తే ప్రత్యర్థులు జైలుకు వెళ్లడం తెలుగు నాట, దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.

To Top

Send this to a friend