చైనాతో యుద్ధం వస్తే మన నిలబడగలమా.?


మోడీ విదేశీ విధానంలో తేడానో లేక.. చైనా దుందుడుకు వైఖరో తెలియదు కానీ ఇప్పుడు చైనా, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటోంది.. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చైనాతో సరిహద్దు విభేదాలున్నాయి. ఈ వివాదాలతో 1962లో ఇండియా-చైనా యుద్ధం జరిగింది. కశ్మీర్ లోని అక్సాయ్ చిన్, లఢక్ లను చైనా ఆక్రమించడంతో భారత్ వ్యతిరేకించి యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇండియా ఓడిపోయి సంధి చేసుకుంది. సరిహద్దు రేఖలను నిర్ణయించుకొని నాలుగు దశాబ్దాలుగా సైలెంట్ గా ఉంటోంది.

కానీ ఈ మధ్య చైనా భారత దేశ భూభాగంపైకి వచ్చి ఆక్రమించుకుంటూ.. పలు రోడ్డు, నిర్మాణాలు చేపడుతూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా భారత్ కు ఎన్.ఎస్.జీ లో భద్రతామండలిలో చోటు కల్పించకుండా అడ్డుకుంటోంది.

భారత్ ఆర్థికాభివృద్ధిలో చైనాను సమీపిస్తోంది. అంతేకాకుండా సాంకేతిక అభివృద్దిలో అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఓ రకంగా రాబోయే కొన్నేళ్లలో చైనాను మించిపోతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. వీటన్నింటిపై గుర్రుగా ఉన్న చైనా… భారత్ ను ఎలాగైనా కల్లోల పరచాలని సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలోని వివాదాస్పద భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తోంది. ప్రస్తుతానికి ఇరు దేశాల మద్య కాల్పులు , యుద్ధం లాంటివి జరిగే పరిస్థితులు లేకున్నా.. చైనా మాత్రం భారత్ పై పైచేయి సాధించడానికి ఈ కుట్రలు చేస్తోంది..

భారత్, చైనా యుద్ధం జరిగితే రెండు దేశాలకు నష్టమే.. మనకంటే అపార సైనిక, రక్షణ శక్తి ఉన్న చైనాకు మనం తక్కువే కావచ్చు.కానీ మన దగ్గర అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలున్నాయి. వాటితో చైనాకు భారీ నష్టం కలిగించవచ్చు. రెండు దేశాల్లోని అపార జనాభాను హరించవచ్చు. అందుకే ఈ విషయం తెలుసు కనుకే చైనా పైపైన మాత్రమే బీరాలకు పోతోంది. పాకిస్తాన్ వలే ప్రచ్చన్న యుద్ధానికి దిగుతోంది. చైనాతో యుద్ధం వచ్చిన ఎదుర్కొనగలిగే అపార సైనిక శక్తి మన వద్ద ఉంది. చైనా అంతా కాకపోయినా మనం చైనాను గట్టిగానే ఎదుర్కోగలం..

To Top

Send this to a friend