చైతూకు సక్సెస్‌ ఇస్తే.. ఇక అఖిల్‌తోనే!

నాగార్జున కెరీర్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం నిలిచి పోయే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. స్వయంగా నాగార్జున ఆ సినిమాను నిర్మించి భారీ లాభాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో తనయుడు నాగచైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. తప్పకుండా రారండోయ్‌.. చిత్రం సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నాయి.

చైతూ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా సక్సెస్‌ అయితే కళ్యాణ్‌ మూడవ సినిమా అఖిల్‌తో ఉండటం పక్కాగా కనిపిస్తుంది. ఆ సినిమాను కూడా అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించే అవకాశాలున్నాయి. వరుసగా మూడు, అవి కూడా మొదటి మూడు సినిమాలు ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోలో చేయడం కళ్యాణ్‌ కృష్ణకు వరం అని చెప్పుకోవచ్చు.

మరి కొన్ని గంటల్లో రారండోయ్‌.. ఫలితం తేలిపోనున్న నేపథ్యంలో అఖిల్‌తో మూవీ విషయమై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అఖిల్‌ రెండవ సినిమాకే కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం అన్నారు. అయితే విక్రమ్‌ కె కుమార్‌ ఒక మంచి స్క్రిప్ట్‌ను తీసుకు రావడంతో దాన్ని వాయిదా వేయడం జరిగింది. అఖిల్‌ రెండవ సినిమా పూర్తి అయిన తర్వాత రారండోయ్‌.. సక్సెస్‌ అయితే ఇద్దరి కాంబోలో మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend