జియో ఫోన్ ను మించి ఐడియా ఫోన్

జియో దెబ్బకు ఈ త్రైమాసికంలో దాదాపు 800 కోట్ల నష్టాల పాలైన ఐడియా ఎట్టకేలకు తాను కూడా మారి జియోలా వినియోగదారులకు చేరువయ్యేందుకు పెద్ద స్టెప్ వేసింది. ఇతర టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు జియో బాటలోనే నడుస్తున్నాయి. తాము కూడా 4జీ శ్రేణులో ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

జియోను తట్టుకోవాలంటే సొంత ఫోన్ల ఆవిష్కరణ తప్పదని భావించి టెలికాం ఆపరేటర్ ఐడియా రంగంలోకి దిగింది.. రిలయన్స్‌ జియో ఫీచర్ ఫోన్ దెబ్బ నుంచి కోలుకునేందుకు ఐడియా సెల్యులార్ కొత్త ఐడియాకు తెరతీసింది. ఇటీవల జియో ప్రకటించినట్లుగానే ఐడియా సెల్యులార్ తక్కువ ధరలో తన 4జీ హ్యాండ్ సెట్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఇటీవల ఫీచర్ ఫోన్ ను సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి తెస్తామని జియో ప్రకటించిన కొన్ని రోజులకే ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది.

జియో హ్యాండ్ సెట్లలో కొన్ని యాప్స్ మాత్రమే పనిచేస్తాయని, నెటిజన్లకు కీలక అవరసరమైన వాట్సాప్ లాంటి కొన్ని ఫీచర్లు తమ హ్యాండ్ సెట్లలో అందుబాటులోకి రానున్నాయని ఐడియా ప్రకటించింది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.2500 వరకు ఉంటుందని ఐడియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నా

To Top

Send this to a friend