ఇదంతా మోడీ కుట్ర?

మోదీ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు రహస్యాన్ని ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ (ఏపీఆర్) సంస్థ బయటపెట్టింది. ప్రపంచ ఆర్దికవ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వేసిన విషప్రయోగానికి భారత్‌ ఎలా బలైపోయిందో ఏపీఆర్ వెల్లడించింది. ”దాచిపెట్టిన రహస్యం – మోదీ చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రయోగం వెనుక వాషింగ్టన్” పేరుతో ఓ రిపోర్టును వెల్లడించింది. దీనిప్రకారం ఇప్పటికే ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు ఎత్తు వేసింది. ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవల్‌పమెంట్‌ (యుఎస్‌ఎఐడీ) రంగంలోకి దిగింది. ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్దిక వ్యవస్థను వాషింగ్టన్‌లో కూర్చుని నిఘా ఉంచాలన్నది యూఎస్‌ఏఐడీ ఎత్తుగడ. ఇందులో భాగంగా అమెరికా ముందుగా ఇండియాపై కన్నేసింది. వెంటనే భారత ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపింది. ఇదంతా ఏడాది క్రితం నుంచే ఆర్బీఐ అధికారులు, ఒబామా, మోదీ మధ్య సంబంధాలను కూడా యూఎస్ ఇందుకోసం చక్కగా వాడుకుంది.

నగదు రహిత సమాజం పేరుతో భారత్‌ను ముగ్గులోకి దింపింది. సాధారణంగా ఈ ప్రయోగం ముందుగా ఒక నగరాన్ని క్యాష్ లెస్‌ కోసం ఎంపిక చేసి ప్రయోగం చేయాలనుకున్నారట. కానీ భారతీయుల అమాయకత్వాన్ని గమనించి ఏకంగా ఒక్కసారిగా దేశం మొత్తం మీద ప్రయోగాన్ని చేసినట్టు ఈ ఏపీఆర్‌ రిపోర్టు సంచలన విషయాలు వెల్లడించింది. ఒకేసారి పెద్దనోట్ల రూపంలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసి తద్వారా ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నగదురహిత లావాదేవీలవైపు మళ్లేలా చేయాలన్న వికృత ఆలోచనను ప్రవేశపెట్టారు. భారతీయులపై చేసిన ఈ విషప్రయోగం వెనుక అమెరికా, భారత్‌ పెద్దలతో పాటు 35 కార్పొరేట్ కంపెనీలు కూడా పనిచేసినట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. దీనివల్ల అమెరికాకు, కార్పొరేట్ సంస్థలకు ఏం లాభమన్న దానికి ఈ సర్వే సమాధానమిచ్చింది. నోట్ల రద్దుతో సామాన్యుల బతుకులు చిద్రం అయినా డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లోని ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌, పేటీఎం వంటి సంస్థలకు భారీగా లాభాలు వస్తాయి. అన్నింటికి మించి అమెరికా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఇందులో ఉంది.

ఐటి, ఐటి ఆధారిత పేమెంట్‌ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్‌ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్‌ పెరుగుతుంది. అదే సమయంలో వాషింగ్టన్‌లో కూర్చొని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా వేసేందుకు అమెరికాకు వీలవుతుంది. అమెరికా చేసిన ఈపని వల్ల ముందుగా భారత్‌ బలైపోయినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మోదీ చెప్పిన నల్లధనం, అవినీతి నిర్మూలన ఇవన్నీ కేవలం ప్రజల చెవుల్లో పూలుపెట్టేందుకు చెప్పిన అబద్దాలని రిపోర్ట్ ను బట్టి స్పష్టమవుతోంది. పైగా మోడి కూడా మొదట్లో నల్ల కుబేరులను అరికట్టేందుకు ఈ నిర్ణయం అని ఒకసారి, క్యాష్ లెస్ కంట్రీగా చేస్తానని మరోసారి, పేదవారికి లబ్ధి చేకూర్చేందుకే అని ఇంకోసారి ఇలా మాటలు మార్చడం.. మొదట్లో ఉన్న కాన్ఫిడెన్స్ క్రమేపీ కరువవ్వడం కూడా ఈ సర్వే రిపోర్టుకు ఊతమిస్తోంది.

అమెరికా ఎన్నికల వేళ ఒకానొక దశలో స్వదేశీ భజన బృందాలు అమెరికాలో రాబోయే ప్రభుత్వం భారత్ అనుకూల ప్రభుత్వమే అని యాగాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న సంఘటనలు, చేపడుతన్న చర్యలు నిశితంగా పరిశీలిస్తే నోట్ల రద్దు నిర్ణయం వెనుక కుట్రను అర్ధం చేసుకోవచ్చు. నోట్ల రద్దు వంటి అతి పెద్ద నిర్ణయం కూడా ముందు వెనుక ఆలోచించకుండా, ప్రయోజనం-నష్టం భేరిజు వేసుకోకుండా నే, భారత్ లాంటి పెద్ద ఆర్థికమార్కెట్ కలిగిన దేశంను, అమెరికా ఎట్లా economic crisis లో పడేసిందని ప్రపంచ ఆర్థికవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలు నివ్వెరపోతున్నా దేశపాలకులకు మాత్రం అర్థం కానంత మాయలో పడేసింది.

ఎక్కడి స్వదేశీ నినాదం ఎక్కడి నుండి నియంత్రించ బడుతోంది?

To Top

Send this to a friend